గ్రహములు

సూర్యుడు 2. చంద్రుడు 3. అంగారకుడు 4. బుధుడు 5. బృహస్పతి 6. శుక్రుడు 7 శని - ఈ ఏడు గ్రహములను మనం ఆకాశంలో చూడవచ్చు. (కొన్ని కంటికి కనబడతాయి. మరికొన్ని వేధశాలలో (ప్లానెటోరియంలో) దూరేక్షికద్వారా కనబడతాయి.) నవగ్రహాలలో చివరి రెండు ఛాయా గ్రహాలు. 8. రాహు 9. కేతు. గ్రహముల నీడను బట్టి, వీటి స్థానమును ఊహించి నిర్ణయిస్తారు. ఈ నీడలో సూర్య చంద్ర గ్రహములు ఉండటాన్నే గ్రహణము అంటారు. భూమిపై నివసించే వారిపైనా, భూమండలముపైనా, ఇతర గ్రహ గోళముల ప్రభావం మెండుగా ఉందనే విషయాన్ని మన సంప్రదాయం స్పష్టీకరిస్తూ, ఆ గ్రహ నక్షత్ర మండల అధిదేవతలను ఆరాధించాలని , తద్వారా శుభాన్ని పొందమని సూచిస్తున్నది. (ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మొదలైన అనేక గ్రహనక్షత్రాలను ప్రస్తావించారు. ఇంద్ర, వరుణ, యమ - అనే పేర్లతో భారతీయులలో కొందరు ఈ గ్రహగోళాల గతులను పరిశీలిస్తూ, ఫలితాంశాలను విశ్లేషిస్తున్నారు.)