సంవత్సర ఫలితము

 v   కలియుగ శతాబ్దములు            -         5117        

v   శ్రీ శంకరాచార్యాబ్దములు           -        2088

v   విక్రమార్క శతాబ్దములు            -        2073

v   శాలివాహన శతాబ్దములు          -        1938

v   హిజరీ శతాబ్దములు                 -        1936-37

v   శ్రీ రామానుజాబ్దములు              -        999

v   భారతదేశ స్వతంత్రాబ్దములు       -        69

v   మధ్వాచార్యాబ్దములు                -        900   

v   ఇంగ్లీషు                                -        2016-2017

          ఈ సంవత్సరము రాజు శుక్రుడు, మంత్రి, అర్ఘాధిపతి, సేనాధిపతి, మేఘాధిపతి బుధుడు. పూర్వ సస్యాధిపతి, నీరసాధిపతి శని. రసాధిపతి చంద్రుడు. ధాన్యాధిపతి శుక్రుడు. పూర్వాహ్ణ (ఉదయము) కాలమున రవి ఆర్ద్రా ప్రవేశముచే కలహములు, రోగములు, యుద్ధము.

 రాత్రి సమయమున రవి మేషరాశిలో ప్రవేశముచే సస్యాభివృద్ధి, పాడిపంటలు సమృద్ధి. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అగుటచే పశువులకు వృద్ధి, పంటలు బాగుగా ఉండును. గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠాద్భహిష్కర్త బలరాముడైనందున పాడిపంటలు సమృద్ధి, సుభిక్షము. 4 తూముల వర్షము అందు 7 భాగములు సముద్రమునందు, 9 భాగములు పర్వతములందు, 4 భాగములు భూమియందు వర్షించును. 16 వీసములకు 10 వీసముల పంట లభించును. తెల్లని, నల్లని భూములు బాగుగా ఫలించును. జ్యేష్ఠమాస శుద్ధమున తొలకరి వర్షించును.