చాంద్రమానాబ్ద ఫలములు

   దుర్ముఖి నామ సంత్సరమున సస్యానుకూల వర్షములు లేకనూ, ఈతిబాధలు అధికమగుటచేతనూ, పంటలు అంతగా ఫలించవు. దుర్భికము రోగ, చోరాగ్ని భయములు, ప్రజా సంక్షోభము, యుద్ధము రాజకీయ కల్లోలములు కలుగును. ఉత్తములు హీనులగుదురు. దుర్ముఖాధిపతి శని అగుటచే అల్ప మేఘములు, ప్రజాపీడలు అధికమగును. రోగములు ప్రబలును. ఉత్తరాపథమున దుష్కాలము.

పశ్చిమ దేశములందు మహాపీడలు. తూర్పు దేశములందు సుభిక్షము – మిగతా దిశలందున్న ప్రాంతములలో ధాన్యాదుల ధరలు పెరుగును. పాలకులు ప్రజలను పీడించెదరు. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములలో ధాన్యాదుల ధరలు పెరుగును. ఆషాఢమున స్వల్ప మేఘములు. శ్రావణమున వాయు సహిత సువృష్టి, తుఫాను గాలులు వీచును.

సమస్త ధాన్యముల ధరలు పెరుగును. భాద్రపదమున ఖండవృష్టి. ఆశ్వయుజమున రోగములు, సమస్త ధాతు పదార్థముల ధరలు సరసమగును. కార్తిక మార్గశిర, పుష్య, మాఘ మాసములలో దుర్భిక్షము, ఫాల్గునమున రోగము, ప్రజాక్షోభము, లోకపీడ, జనహాని కలుగును.