సంవత్సర ఫలిత సారాంశము

అస్మిన్దేశే లోక వ్యవహారతః చాంద్రమాన వశాదయం దుర్మిఖినామ సంవత్సర, బార్హస్పత్యమానేన (కాశీ ప్రాంతే) సౌమ్య నామ సంవత్సరః,గురూదయ వశాత్ ఫాల్గుణాబ్దః అని వ్యవహరించబడును.

ప్రభవాది 60 సంవత్సరములలో 30వది శ్రీ దుర్మిఖినామ సంవత్సరము. ప్రభవాది 60 సంవత్సరములను ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజించిరి. అగ్ని దేవతాకమగు నందనాది 6వ యుగమున 5వది ఇద్వత్సరనామక మగునది దుర్మిఖి నామ సంవత్సరము. అధిపతి రుద్రుడు, ఇందు రజత దానము మహాఫలము. రుద్రుని ఆరాధించిన సకల దోషములు తొలగి ఐశ్వర్య మోక్షములు లభించును.

 అబ్దాధిపతి శనిని ఆరాధించిన ఆయురారోగ్యములు లభించును. నవ నాయకులలో 7గురు శుభులు, ఇద్దరు పాపులు. 21 మంది ఉపనాయకులలో 10 శుభులు, 11 మంది పాపులైరి. ఈ సంవత్సరము వర్ష లగ్నము కన్య.