రాజాది నవనాయక ఫలములు

 1.రాజు- (శుక్రుడు):- రాజు శుక్రుడు అగుటచే మంచి వర్షములు కురియును. పంటలు సమృద్ధిగా పండును. పాడి పశువులు సమృద్ధిగా పాలనిచ్చును. కామోపచారములచే కాంతలు ప్రియులను తృప్తిపరెచదరు. వెండి, బంగారము, కుసుమ ధాన్యములు, తెల్లని ధాన్యములు, వజ్రములు, మణులు, ఆహార ధాన్యములు, పట్టు, ముత్యములు, జొన్నా – సజ్జ, కస్తూరి, సుగంధ ద్రవ్యములు, చింతపండు, పసుపు, మిర్చి, మిరియాలు, నూనె గింజలు, వేరుశెనగ, తెల్లని రంగులు, గాజు పాత్రలు, అద్దములు, రాగి, నెంబర్లు, దూది, నూలు, ధాన్య, వ్యాపార ధరలు పెరుగును.

2.  మంత్రి (బుధ):-మంత్రి బుధుడగుటచే మబ్బులు, వాయువుతో కూడి యుండును. ధన ధాన్య సమృద్ధి ఉండును. నూనె గింజల ధరలు పెరుగును. సస్యములు మధ్యమ ఫలములనిచ్చును.

3.  సస్యాధిపతి (శని):- పూర్వ సస్యాధిపతి శని అగుటచే నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగుగా ఫలించును. నువ్వులు, మినుములు, అవిసెలు, నల్లధాన్యములు. ఉలవలు, చింతపండు, పొగాకు, చర్మములు, ఇనుము, యంత్ర పరికరములు, కట్టెలు, బొగ్గు ధరలు సమమగును.

4. సైస్యాధిపతి (బుధుడు):-బుధుడు సేనానాయకుడగుటచే మేఘములు, వాయుధ్రుతములై కష్టముచే వర్షించును, మేఘాడంబరత అధికము. సస్యములు తగినట్లుండును. ప్రజలు కామాచార పరాయణులై ఉందురు. స్వాతంత్ర్య ప్రియులకు రాజకీయబాధలుండును. వాయువుతో కూడిని మేఘాలు ఒకానొకప్పుడు వర్షించును. పంటలు సంపూర్ణముగా పండును.

5.  ధాన్యాధిపతి (శుక్రుడు):-అతివృష్టి, సుభిక్షము. మంచి పంటలు, ప్రజలకు ఆరోగ్యములు కలుగును. అన్ని జాతుల ధాన్యములు ఫలించును

6.   అర్ఘాధిపతి (బుధుడు):-మంచి వర్షములు, మంచి పంటలు కలుగును. పాషండులు, ఇంద్రజాలకులు, యువకులు దుష్టులయ్యెదరు. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, అపరధాన్యములు, వెండి, బంగారం, వేరుశెనగ, నూనె గింజలు, ప్రత్తి, నూలు, నార, గోనెసంచులు, పసుపు, కలప, కాగితము, వ్యాపార వాటాలు, కాఫీ గింజలు, దూది ధరలు.

7.   మేఘాధిపతి (బుధుడు):- మేఘములకు ఉరుములు, పిడుగులు, గాలి, రాళ్ళు అధికము. వడగండ్లతో కూడిన వర్షములు, మధ్యదేశమున అత్యధిక వర్షములు.

8.   రసాధిపతి (చంద్రుడు):- నెయ్యి, నూనె గింజలు, కొబ్బరినూనె, వేరుశెనగ నూనె, ఆముదములు, అవిశ నూనె, కిరసనాయిలు, పెట్రోలు మొదలగు నూనెలకు, బెల్లం, చెరకు, పంచదార మొదలయినవాని ధరలు పెరుగును.

9.   నీరసాధిపతి (శని):-బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము నశించును. ఇనుము, ఇత్తడి వృద్ధియుండుటచే ధర కొంత తగ్గుయుండును.