2.   వృషభరాశి ఫలితములు

కృత్తిక:2, 3, 4 పాదములు, రోహిణి:1, 2, 3, 4 పాదములు, మృగశిర:1, 2 పాపాదములు

ఆదాయ - 11                    వ్యయం - 14

రాజపూజ్యం - 4                 అవమానం - 7

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 4ట రజితమూర్తి, తదుపరివత్సరంతయును 5ట తామ్రమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 7ట తామ్రమూర్తిగానూ, తదుపరి 8ట వత్సరమంతయు లోహమూర్తి. వత్సరమంతయ రాహువు 4, కేతువు 10ట రజిత మూర్తులుగాను సంచరింతురు.

         ఈ రాశివారికి స్థానచలనములచే సుఖలోపము, మాతృవర్గమువారితో విరోధము, గృహనిర్మాణ అవకాశములు, ఉన్న యింటిలో మార్పులు, నూతనముగా గృహ నిర్మాణమునకు స్థలము, భూ గృహాది స్థిరాస్తులను సంపాదించుట, శ్రమకు తగిన ప్రతిఫలము పొందుట, కుటుంబమునకు వెన్నెముకగా నిలుచుట  వీరి ప్రత్యేకతలు.

         ఆగస్ట్ తదుపరి సంవత్సరాంతము వరకు గురుబలముచే కార్యసిద్ధి పుత్రమూలక సుఖం, కుటుంబంలో సంతానం కలసి వచ్చుట, పిల్లలు విద్యావిషయంలో మందంజ వేయుట, సంవత్సర  ప్రారంభంలో బుద్ది చాంచల్యము, ధనలాభము వలన సుఖసంతోషములు కలిగి స్వజన బంధుమిత్రులతో గౌరముగా వుందురు. తన పనులను చాకచక్యముతో నిర్వర్తించుకుని ఇతరులకు సహాయపడగలరు. గృహమున సంతోష వాతావరణము, మనస్సుకు సుఖము, ఎల్లప్పుడూ సంతోషమూ, ఇష్ట భోజనమూకార్య సిద్ధిపొందుట, శని అ,టమరాశి సంచారముచే స్థానచలముఅనారోగ్య సూచనలు.

         బంధువులతో అకారణ విరోధములున్ననూ గురుబలముచే అన్నిటినీ ఎదుర్కని నిలబడగలరు.ఆరోగ్యము క్రమేపి బాగుపడును. మీ వృత్తికి సంబంధించి కొంత ఆందోళన  తద్వారా స్థానచలనం. పై  అధికారుల వత్తిడి, అవసర సమయాల్లో ధనము అందటం ఆలస్యమవుతుంది. దేశాంతర ప్రయాణము, ద్రవ్యనాశనము, భార్యామూలక ధనవ్యయమూ, అనారోగ్యము, వ్యవహార చికాకులు, కష్ట నష్టములు  సంప్రాప్తించును.

         వృధావ్యయము తగ్గించుకోవడం మంచిది. గృహవాతావరణం సంవత్సర పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో బాగుంటుంది. క్రమేపి కుటుంబ సభ్యుల ఆలోచనలలో మార్పు మీకు అనుకూలం. వ్యవసాయదారులకు కృషికి తగిన ఫలితములుంటాయి.రెండవ పంట బాగా  అనుకూలిస్తుంది. శ్రమించి విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు.రాజకీయ నాయకులకు ఇతర పార్టీల నుండి ప్రతిఘటనలు ఎదురగును. లాయర్లకు, వైద్యులకు, ఉపాధ్యాయులకు కొద్దిపాటి లాభము ఏ రంగము వారికైనను మిశ్రమ ఫలితములుండును.

         ఈ రాశివారికి అదృష్ట సంఖ్య- 6 3,4,5.8 తేదీలు, సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు కలిసిన యోగప్రదము. సంవత్సరమంతయూ ప్రతిదినమూ శివదర్శనము, శివాష్టోత్తర, దుర్గాస్తోత్ర పారాయణలు చేసిన మేలు జరుగును.