2.   వృషభరాశి ఫలితములు

కృత్తిక:2, 3, 4 పాదములు, రోహిణి:1, 2, 3, 4 పాదములు, మృగశిర:1, 2 పాపాదములు

ఆదాయ - 11                    వ్యయం - 14

రాజపూజ్యం - 4                 అవమానం - 7

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 4ట రజితమూర్తి, తదుపరివత్సరంతయును 5ట తామ్రమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 7ట తామ్రమూర్తిగానూ, తదుపరి 8ట వత్సరమంతయు లోహమూర్తి. వత్సరమంతయ రాహువు 4, కేతువు 10ట రజిత మూర్తులుగాను సంచరింతురు.

         ఈ రాశివారికి స్థానచలనములచే సుఖలోపము, మాతృవర్గమువారితో విరోధము, గృహనిర్మాణ అవకాశములు, ఉన్న యింటిలో మార్పులు, నూతనముగా గృహ నిర్మాణమునకు స్థలము, భూ గృహాది స్థిరాస్తులను సంపాదించుట, శ్రమకు తగిన ప్రతిఫలము పొందుట, కుటుంబమునకు వెన్నెముకగా నిలుచుట  వీరి ప్రత్యేకతలు.

         ఆగస్ట్ తదుపరి సంవత్సరాంతము వరకు గురుబలముచే కార్యసిద్ధి పుత్రమూలక సుఖం, కుటుంబంలో సంతానం కలసి వచ్చుట, పిల్లలు విద్యావిషయంలో మందంజ వేయుట, సంవత్సర  ప్రారంభంలో బుద్ది చాంచల్యము, ధనలాభము వలన సుఖసంతోషములు కలిగి స్వజన బంధుమిత్రులతో గౌరముగా వుందురు. తన పనులను చాకచక్యముతో నిర్వర్తించుకుని ఇతరులకు సహాయపడగలరు. గృహమున సంతోష వాతావరణము, మనస్సుకు సుఖము, ఎల్లప్పుడూ సంతోషమూ, ఇష్ట భోజనమూకార్య సిద్ధిపొందుట, శని అ,టమరాశి సంచారముచే స్థానచలముఅనారోగ్య సూచనలు.

         బంధువులతో అకారణ విరోధములున్ననూ గురుబలముచే అన్నిటినీ ఎదుర్కని నిలబడగలరు.ఆరోగ్యము క్రమేపి బాగుపడును. మీ వృత్తికి సంబంధించి కొంత ఆందోళన  తద్వారా స్థానచలనం. పై  అధికారుల వత్తిడి, అవసర సమయాల్లో ధనము అందటం ఆలస్యమవుతుంది. దేశాంతర ప్రయాణము, ద్రవ్యనాశనము, భార్యామూలక ధనవ్యయమూ, అనారోగ్యము, వ్యవహార చికాకులు, కష్ట నష్టములు  సంప్రాప్తించును.

         వృధావ్యయము తగ్గించుకోవడం మంచిది. గృహవాతావరణం సంవత్సర పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో బాగుంటుంది. క్రమేపి కుటుంబ సభ్యుల ఆలోచనలలో మార్పు మీకు అనుకూలం. వ్యవసాయదారులకు కృషికి తగిన ఫలితములుంటాయి.రెండవ పంట బాగా  అనుకూలిస్తుంది. శ్రమించి విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు.రాజకీయ నాయకులకు ఇతర పార్టీల నుండి ప్రతిఘటనలు ఎదురగును. లాయర్లకు, వైద్యులకు, ఉపాధ్యాయులకు కొద్దిపాటి లాభము ఏ రంగము వారికైనను మిశ్రమ ఫలితములుండును.

         ఈ రాశివారికి అదృష్ట సంఖ్య- 6 3,4,5.8 తేదీలు, సంఖ్యలు, బుధ, శుక్ర, శనివారములు కలిసిన యోగప్రదము. సంవత్సరమంతయూ ప్రతిదినమూ శివదర్శనము, శివాష్టోత్తర, దుర్గాస్తోత్ర పారాయణలు చేసిన మేలు జరుగును.


 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్:  గృహమున మంగళకరమగు వాతావరణము, కళ్యాణాది  శుభకార్యములకు శుభసూచన, ద్రవ్యలాభము, ద్వితీయార్థం ధనవ్యయము. విపత్తులు, భార్యా ఆరోగ్యము  అంతంత మాత్రం, సౌఖ్యములు కలుగును. సంగీత సంబంధ విద్యలలో నైపుణ్యతలు.

మే: ధనవ్యయము, చుట్టములకు అనారోగ్యము, ఉద్యోగస్తులకు ఇది కష్టకాలముపై అధికారులతో విభేదములు, తనకు తగిన ప్రోత్సాహకరమగు పనిని అప్పగించకపోవుట, చిన్నచూపు మొదలైన లక్షణములు  ఉండును.

జూన్:  పై అధికారులతో ఇబ్బందులు, ఆర్థిక విషయాలు అంతంత మాత్రం, గృహమున ప్రోత్సాహకరముగా లేకపోవుట, జన్మరాశియందు  రాశి సంచారముచే  కోపముస్వల్ప అనారోగ్యము, అలసత్త్వము, ఆదిత్యహృదయ పారాయణ చేయుట చే మేలు జరుగును.

జూలై:తీర్థయాత్రాదికములు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన, ప్రకృతి విరోధములు, అలసట, నాభి, ఉదర సంబంధ అనారోగ్యము, ఉష్ణ సంబంధమైన కురుపులుభార్యామూలక అనారోగ్యము. అయితే గురుబలం బాగున్నది. స్థానభ్రంశము, ధనవ్యయము.

ఆగస్ట్: అష్టమ రాశియందు కుజుని సంచారము అంత అనుకూలంకాదు. వీరికి ఋణం చేయవలసి వచ్చుట, అప్పుల బాధలు, శరీర ఆరోగ్యము అంతంత మాత్రం, ఎముకలు విరుగుట, దోషపరిహారార్థం  ఈశ్వరాభిషేకం చేయటం మంచిది.

సెప్టెంబర్: విద్యా వ్యాసంగములలో పాల్గొనుట, సుఖము, సంతోషం, మనోధైర్యము, ఇష్ట కార్యసిద్ధి, బహుమతులు గెల్చుకొనుట, సాత్వకమైన  ఆహరమును భుజించుట ధన సౌఖ్యమును పొందుట జరుగును.

అక్టోబర్: వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమ, అధిక ప్రయాణాలు అలసట, ఆలస్య భోజనం, స్వల్ప అనారోగ్యం, కోర్టు వ్యవహారాలు కొలిక్కిరాకపోవుటధనవ్యయం, ఉద్యోగులకు మితిమీరిన ఖర్చులు, గృహోపకరణ వస్తువులు  కొనుగోలు.

నవంబర్: సంతానం విషయమై ఆలోచిస్తారు. వారికి తగిన సంబంధం చూడాలనే దిగులు, వారి విద్యా విషయాలకై చింతిస్తారు. కళత్ర సంబంధమైన స్వల్ప అనారోగ్యం. తరచూ తరచూ వైద్యల్ని సంప్రదించడం జరుగుతుంది.

డిసెంబర్:అధిక వత్తిడిచే  ఆరోగ్య లోపములు, ఆయాసము, ఉబ్బసము, రక్తపోటు మొదలగు లక్షణములు. ఉద్యోగులకు అధికార సిద్ధి, ధర్మ మార్గానుసార ప్రవర్తనము, వ్యాపారస్తులకు విశేష ధనలాభము. స్థాన చలనముఉద్యోగ ఉన్నతితో సూచనలు.

జనవరి: ఆకస్మిక ధనలాభము, వృత్తి వ్యాపారములందు విజయమునూతన వ్యక్తుల పరిచయము, అధికార యోగము, భార్యా మూలక సమస్యలు వీడును. వృత్తి కళాకారులకు సన్మానములు, ఇతర శ్రేయస్సుకై  నిరంతరం కృషి చేయుదురు.

ఫిబ్రవరి: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయుట, శుభ కార్యములయందు పాల్గొనుట, బంధు మిత్ర సమ్మేళనము, విందు వినోదముల యందు పాల్గొనుటద్వారా ధన వ్యయము, నూతనోత్సాహముతో యుండుటఆరోగ్యము అనుకూలము.

మార్చి: ధనలాభము, ద్రవ్యలాభము, ఇష్ట కామ్యార్థసిద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, గృహమున ఆనంద ఆహ్లాదకరమగు వాతావరణములు, అధికారవృద్ధి, ఇతరులచే గౌరవింపబడుటమొదలగు యోగములు గలవు.