3.మిథునరాశి ఫలితములు

మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములు

         ఆదాయ - 14                            వ్యయం - 11

         రాజపూజ్యం - 7                         అవమానం - 7

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 3ట సువర్ణమూర్తి, తదుపరి 4ట వత్సరమంతయూ సువర్ణమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 6ట రజిత మూర్తిగానూ, తదుపరి 7ట వత్సరమంతయూ తామ్రమూర్తి. రాహువు 3ట కేతువు 9ట లోహమూర్తులు.2016 ఆగస్ట్ 11 వరకు గురుడు తృతీయరాశి యందు సువర్ణమూర్తి. తదుపరి వత్సరాంతము వరకు చతుర్థ కేంద్రరాశి యందు సంచరించును.

         వీరికి సంవత్సరమంతయూ గురుబలం లేకపోగా ఉపచయ స్థానములందున్న శని, రాహువుల వలన కొంతవరకు మేలు మాత్రము జరుగును. ఆగస్ట్ ప్రాంతమున స్థానచలన సూచనలు. మానసిక ఆందోళనలు, ధనవ్యయమే, అయిననూ ధనమునకు లోటురాదు. తలచిన కార్యములు మాత్రములు జరుగును. సంవత్సర పూర్వార్థము కంటే  భూగృహ నిర్మాణములు ఆగస్ట్ తదుపరి  కలసివచ్చును.

         తృతీయ స్థానమందలి గురుడు సంచారముచే అతిశ్రమ, బంధుజనులతో విరోధమున్నూ, శరీరబాధ, ఉద్యోగ కార్యము చెడుట, ఇతరులతో జగడము మొ।। ఫలితములు. వీరికి  సంవత్సర ప్రారంభమందు మాత్రమే కలుగును. బుద్ధి చాంచల్యముస్థానాంతరములు, ధనవ్యయము,తేజస్సు నశించుట, ధనము కొరకు ఇతరులను యాచించుట, అయిననూ తిరిగి లాభము పొంది ఋణమును తీర్చగలరు. షష్ఠరాశి గతౌశనీ ధన ధాన్యాభివృద్ధించ బంధు  సంతోషవర్థనం యనుటచే ధనధాన్యములు వృద్ధినొందుట, బంధువులకు సంతోషము కలిగించుట, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట మొదలగు శుభఫలములు శనీశ్వరుని షష్ఠస్థాన స్థితిచే తెలియనగునది.

         2017 సంవత్సర ప్రారంభమున శనీశ్వరుని సప్తమరాశి సంచారంచే హృదయమున ఆందోళన, దేశాంతర సంచారము, ధన నష్టములు తొలగుటకు ఈశ్వరునికి అభిషేకము చేయుటచే దోషములు తొలగి ఉత్తమ ఫలితములు కలుగును. రాహువు తృతీయ స్థానమున యుండుట వలన మర్యాద హాని జరిగిననూ ముందుకు దూసుకుని పోయే మనస్తత్వము, చురుకుదనము వలన  ధనలాభములు కలుగును.

         శతృవర్గము వల్ల మీ పనులకు ఆటంకము కలిగిననూ మీ నిదానమే మిమ్ములను కాపాడుతుంది. శాంతం, సౌమ్యముతో ఇతరులను గెలిచే స్వభావం. గణితం, కామర్సుఎకౌంట్స్ మొదలగు కోర్సులలో విద్యార్థులు విజయము సాధిస్తారు. ధనమును జూదమునకై వాడరాదు.

         స్పెక్యులేషన్ పనికిరాదు. ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు మీ చేతికి అందటం  ఆలస్యమవుతుంది. ఆరోగ్యము విషయంలో  శ్రద్ధ  అవసరం. శని షష్ఠస్థానగతుడగుటచే అనారోగ్యము. ఋణం చేసి, తీర్చడం ఆలస్యమవుతుంది. గుహ్య అవయవాలలో వ్యాధి అవకాశం, శ్లేష్మ సంబంధ అనారోగ్యం, మిత్రులతో వాగ్వాదం తగదు. గృహమున శుభ సూచనలు, ఆరోగ్యప్రదమైన వాతావరణముఉత్తరార్థములో స్థానచలన సూచన. సోదర వర్గం అనుకూలము. పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. అష్టమమందు కేతువు యోగ భంగమే అయిననూ గురుని శుభదృష్టిచే అవరోధములు తొలగును. ఉద్యోగులు పై అధికారుల వలన మాటలు పడుట. ఉపాధ్యాయులకు స్థానచలన సూచనలు. వ్యవసాయదారులకు పంటలు లాభదాయకం. నువ్వులు, తైల, యంత్ర వ్యాపారులకు కొంత మేలు. డయరీ సంస్థలు, పౌల్ట్రీ క్రీడారంగాల వారికి నూతనోత్సాహం. రైస్ మిల్లర్లకు కలిసి వచ్చును. నూతన నిర్మాణాలు, ప్రాజెక్టులు సమర్థవంతముగా పూర్తి చేయగలరు. రాజకీయ నాయకులు జాగరూకతతో వ్యవహరించవలెను.

         ఈ రాశి వారికి అదృష్టసంఖ్య 5.1,3,6,8 తేదీలు. సంఖ్యల, ఆది,గురు, శుక్ర వారములు కలిసిన యోగప్రదములు. వీరు దత్తాత్రేయ పారాయణలు, శ్వత్థ ప్రదక్షిణలు, గురు ఆరాధనలు చేయుటచే దోషములు తొలగును.