నెలవారీ ఫలితములు

ఏప్రిల్: ఐశ్వర్యవృద్ధి, ద్రవ్యలాభము, ఇంటియందు నిత్యోత్సవము, కళ్యాణాది శుభకార్యములు, వస్త్ర, ధనధాన్య లాభములు, కీర్తి, ఉత్సాహము, మనస్సుకు  ఉల్లాసము.

మే: పరోపకారము, గృహమున మంగళకరమగు కర్మాచరణము, దైవభక్తి  వ్యాపారాలలో లాభము, కృషి మూలక ధనము, చిట్ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారములో కలిసి వచ్చుట.

జూన్: గృహసౌఖ్యము, ధైర్యము, మనోత్సాహముతో పనిచేయుట నిరంతరం ధనార్జన ప్రవర్తనలో మార్పు, అనాచారము, నీచజనుల సావాసము, కులచారము తప్పుట.

జూలై: చేతి నిండా ధనము, శరీరసౌఖ్యము,ధైర్యము, భూగృహ స్థిరాస్తుల వలన ఆదాయం పెరుగుట, ఆదాయానికి తగిన ఖర్చు, పుత్ర సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, తండ్రి సోదరులకు కష్టము.

ఆగస్ట్: కుటుంబ సభ్యులంతా కలిసి  కలిసి ఆనందముగా సంబరము చేసుకుంటారు. తృతీయమున అనగా ఉపచయ స్థానమందు రాహు, బుధ, శుక్రులు, మిశ్రమ ఫలములనిత్తురు. స్థానచలన సూచన. గృహమున మరమత్తులునిర్మాణాది పనులు చేయుదురు.

సెప్టెంబర్: సర్వశుభములు. ఉపచయములందు రాహువు గురుడు షష్ఠ స్థానమగు వృశ్చిక స్థానమందు శనీ, కుజులు బ్రహ్మాండమైన యోగము నిచ్చెదరు. శరీరపోషణ, విందు వినోదాలు, సంతోషకర గృహ వాతావరణం, సంతానం వృద్ధిలోకి వచ్చుట.

అక్టోబర్: ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారుఅదృష్టం కలసి వస్తుంది. కళత్ర ఆరోగ్యవిషయంలో జాగ్రత్త. తరచూ వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. అయినా పరవాలేదుమీ సంతానం మీకు ఉపకారం చేస్తుంది.

నవంబర్:  దైవ సంబంధ కార్యాలలో పాలు పంచుకుంటారుసమాజ సేవ చేస్తారుఆధ్యాత్మిక భావము పెరుగుతుందిగృహ నిర్మాణ సంబంధ పనులు కలిసివస్తాయిఇతరుల సహాయం లభిస్తుంది.

డిసెంబర్:  ఆదాయము పెరుగుతుంది. ధైర్యముగా ఉంటారు. గృహము కొనుగోలు ప్రయత్నాలు  అనుకూలిస్తాయివిద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారుఉన్నత విద్యావకాశాల కోసం చేసే ప్రయత్నం  ఫలిస్తుంది.

జనవరి:జనవరిలో మిశ్రమ ఫలితాలుంటాయిప్రారంభంలో అన్ని పనులలోను  విఫలమవుతారు. కళత్ర విషయమై వైద్య సహాయం పొందవలసి వస్తుంది. పనుల తొందర, వత్తిడి ఎక్కువగా ఉంటాయి. ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఫిబ్రవరి: కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. అయితే అష్టమ రాశిలో రవి సంచారం అంత మంచిది కాదు. ప్రయాణములు, అలసట, శత్రు బాధలు అధికం. మనస్థాపం కలిగించే మాటలువినుట. మాసం ఉత్తరార్థంలో  అన్నీ కలిసి వస్తాయి.

 

మార్చి: వాహన విషయాల్లో జాగ్రత్త.మార్గావరోధములు ఏర్పడవచ్చు. నిరపరాధంగా ఇతరులచే తిట్లు తినవలసివస్తుంది. కుటుంబ విషయాలు ప్రోత్సాహకరముగా ఉంటాయి. మాసాంతంలో పుణ్యక్షేత్ర సందర్శనములు, దైవారాధనలు.