4.కర్కాటక రాశి ఫలితములు

పునర్వసు 4వ పాదము, పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1,2,3,4 పాదములు

           ఆదాయం - 8                             వ్యయం - 11

          రాజపూజ్యం - 3                          అవమానం - 3

        గురుడు వత్సరాది నుండి 2016 ఆగస్ట్ 11 వరకు ధనస్థానమందు  గురుడు లోహమూర్తి. తదుపరి వత్సరాంతము వరకు తృతీయ స్థానమందు రజితమూర్తి. శని సంవత్సరాది నుండి 26.1.2017 వరకు 5ట లోహమూర్తిగనూ, తదుపరి 6ట సువర్ణమూర్తిగనూ, వత్సరమంతయూ రాహువు 2, కేతువు 8ట తామ్రమూర్తులు.

         గురుబలము కలదు. తదుపరి సామాన్యము. శని 2017 జనవరి26 వరకు సామాన్య బలము. తదుపరి కొంత బలము కలదు. రాహువు, కేతువుల బలము లేదు. ఆగస్ట్ వరకు కొంత మాత్రం ధనాదాయమున్నను కుటుంబపరమైన వ్యయం అధికం.2016 జనవరి వరకు పుత్రమూలక క్లేశములు, మనఃక్లేశములు, సంవత్సరమంతా శుభాశుభ మిశ్రమం. ప్రశాంతత లోపించును. చాలా అనుకూల సమయం.

      పై అధికారుల మన్ననలు ప్రశంసలు పొందుతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది మంచి సమయంధాన్యం మొదలైన వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మీ ప్రతికూల వర్గాల కంటే మీదే ఆధిపత్యంగా ఉంటుంది. పాత బాకీలన్నీ వసూలవుతాయి. చేతిలో ధనం పుష్కలంగా ఉంటుంది. ధన ప్రవాహం మిమ్ములను వరిస్తుంది. గృహ వాతావరణము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్ములను బాగా ప్రేమిస్తారు. సమాజములో కూడా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. సమాజంలో ఉన్నతశ్రేణి మిమ్ములను బాగా గుర్తిస్తారు. శారీరికంగాను, మానసికంగాను  బాగా ధృఢముగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

         సంవత్సరం ఉత్తరార్థంలో చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. ఆర్థిక లావా దీవీల నిర్వహణ  కష్టమవుతుంది. అయిననూ సరిదిద్దుకొనగలరు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. సంతానం విషయంలో శ్రద్ధ చూపగలరు. ఉన్నత విద్యలలో సంతానము రాణిస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. కుటుంబ కలహములు, ఆరోగ్యము లోపించును. తరచూ స్థాన చలనములు సంభవించును.

         విద్యార్థులు ఎంత శ్రమించిననూ ఫలితము సామాన్యము. ఉద్యోగులు పై అధికారుల చే మాట పడవలసివచ్చును. వ్యవసాయ దారులకు రెండు పంటలు సామాన్యఫలితము. వ్యాపారస్తులు నష్టములు చవిచూడవలసి వచ్చును. వైద్యులు, లాయర్లు, కళాకారులు, పౌల్ట్రీ పరిశ్రమల వారు జాగరూకతతో వ్యవహరించవలెను. రాజకీయనాయకులకు కాలము కలిసిరాదు.

         ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2. 4,6,8,9 తేదీలు సంఖ్యలు. ఆది, సోమ, శుక్ర, శనివారములు కలిసిన మరింత యోగదాయకము. శివాభిషేకములు, శివస్తోత్రపారాయణలు, సుబ్రహ్మణ్యారాధన, స్తోత్రపారాయణ, గురు,మంగళ, శుక్రవార నియమములు ఆచరించవలెను.