4.కర్కాటక రాశి ఫలితములు

పునర్వసు 4వ పాదము, పుష్యమి 1,2,3,4 పాదములు, ఆశ్లేష 1,2,3,4 పాదములు

           ఆదాయం - 8                             వ్యయం - 11

          రాజపూజ్యం - 3                          అవమానం - 3

        గురుడు వత్సరాది నుండి 2016 ఆగస్ట్ 11 వరకు ధనస్థానమందు  గురుడు లోహమూర్తి. తదుపరి వత్సరాంతము వరకు తృతీయ స్థానమందు రజితమూర్తి. శని సంవత్సరాది నుండి 26.1.2017 వరకు 5ట లోహమూర్తిగనూ, తదుపరి 6ట సువర్ణమూర్తిగనూ, వత్సరమంతయూ రాహువు 2, కేతువు 8ట తామ్రమూర్తులు.

         గురుబలము కలదు. తదుపరి సామాన్యము. శని 2017 జనవరి26 వరకు సామాన్య బలము. తదుపరి కొంత బలము కలదు. రాహువు, కేతువుల బలము లేదు. ఆగస్ట్ వరకు కొంత మాత్రం ధనాదాయమున్నను కుటుంబపరమైన వ్యయం అధికం.2016 జనవరి వరకు పుత్రమూలక క్లేశములు, మనఃక్లేశములు, సంవత్సరమంతా శుభాశుభ మిశ్రమం. ప్రశాంతత లోపించును. చాలా అనుకూల సమయం.

      పై అధికారుల మన్ననలు ప్రశంసలు పొందుతారు. మీ కృషికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది మంచి సమయంధాన్యం మొదలైన వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మీ ప్రతికూల వర్గాల కంటే మీదే ఆధిపత్యంగా ఉంటుంది. పాత బాకీలన్నీ వసూలవుతాయి. చేతిలో ధనం పుష్కలంగా ఉంటుంది. ధన ప్రవాహం మిమ్ములను వరిస్తుంది. గృహ వాతావరణము మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్ములను బాగా ప్రేమిస్తారు. సమాజములో కూడా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. సమాజంలో ఉన్నతశ్రేణి మిమ్ములను బాగా గుర్తిస్తారు. శారీరికంగాను, మానసికంగాను  బాగా ధృఢముగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

         సంవత్సరం ఉత్తరార్థంలో చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. ఆర్థిక లావా దీవీల నిర్వహణ  కష్టమవుతుంది. అయిననూ సరిదిద్దుకొనగలరు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. సంతానం విషయంలో శ్రద్ధ చూపగలరు. ఉన్నత విద్యలలో సంతానము రాణిస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. కుటుంబ కలహములు, ఆరోగ్యము లోపించును. తరచూ స్థాన చలనములు సంభవించును.

         విద్యార్థులు ఎంత శ్రమించిననూ ఫలితము సామాన్యము. ఉద్యోగులు పై అధికారుల చే మాట పడవలసివచ్చును. వ్యవసాయ దారులకు రెండు పంటలు సామాన్యఫలితము. వ్యాపారస్తులు నష్టములు చవిచూడవలసి వచ్చును. వైద్యులు, లాయర్లు, కళాకారులు, పౌల్ట్రీ పరిశ్రమల వారు జాగరూకతతో వ్యవహరించవలెను. రాజకీయనాయకులకు కాలము కలిసిరాదు.

         ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2. 4,6,8,9 తేదీలు సంఖ్యలు. ఆది, సోమ, శుక్ర, శనివారములు కలిసిన మరింత యోగదాయకము. శివాభిషేకములు, శివస్తోత్రపారాయణలు, సుబ్రహ్మణ్యారాధన, స్తోత్రపారాయణ, గురు,మంగళ, శుక్రవార నియమములు ఆచరించవలెను.


 

నెలవారీఫలితములు

ఏప్రిల్: పూర్వార్థమున నిరపరాధముగా ద్రవ్యనాశనము, ఉత్తరార్థమున ధనలాభము, శరీరసౌఖ్యము, బంధుమిత్రులతో కలిసి ఉండుట, ఆరోగ్యము, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుట, ద్రవ్యము దొరకుట, మంచి సౌఖ్యము, పాపకార్యములు  చేయుట.

మే:నిత్యోత్సాహము, ఇంటియందు శుభ వాతావరణములు, ధనయోగము, ఆనంద సిద్ధి, తరచూ ప్రయాణ అలసట,భూ గృహ స్థిర ఆస్తుల వృద్ధి, వ్యవసాయ లాభములు, ఆరోగ్యం, సభా గౌరవము, వాక్చాతుర్యం, సత్యవాక్కులు, వ్యవహార జయములు.

జూన్:లాభస్థానమందలి రవి సమస్త దోషములను పోగొట్టి సకల సంపదలను కలుగజేయును. వాహన సౌఖ్యము, లాభస్థాన గతుడగ శుక్రుడునూ శరీరమునకు పుష్కలమగు కాంతియూ, ఇష్ట కార్యసిద్ధి, అర్థలాభము, క్షీరాన్నభోజనము, కీర్తి.

జూలై: ధనవ్యయం, పిల్లల గూర్చి చింతన, మనసున సంకటము, వ్యవసాయ ఖర్చులు వ్యాపారులకు పెట్టుబడులకు తగినంత ఆదాయం లేకుండుట, అధిక ధన వ్యయము కలుగును. కౄరమగు పనులు, బంధు వైరం, వ్యాధుల వలన కలుగు తాపము.

ఆగస్ట్: మిశ్రమ ఫలితములు. జన్మరాశి యందు సూర్యుని సంచారము చే కోపము, ఔదార్యము,తొందరపాటు ప్రతాపము, దేహము నందు వ్రణములు, పీడలు, అనారోగ్యం, హృదయమున సంకటము, వేళకాని వేళ భోజనము చేయుట,శ్రమ, త్రిప్పట,విశిష్ట వస్తువులను సేకరించుట, రత్నముల వ్యాపారులకు లాభము కలుగును.

సెప్టెంబర్: వర్తక వ్యాపారములు సామాన్యములు. సజ్జన సావాసంఇతరత్రా ధనలాభము, దైవ సంబంధ విషయాలపై ఆసక్తిదేవతారాధనముసక్రమమైన నడవడిక మంగళప్రదము, ఐశ్వర్యప్రదము, దేహసౌఖ్యము, ద్రవ్యలాభము, సంతోషం కలుగును.

అక్టోబర్: సోదర మూలకముగా సుఖసంతోషములు, ధైర్యముసోదరుల అండ కలుగుతుంది. వారి ఉన్నతిని  కోరుకుంటారుదైవ క్షేత్రాలను సందర్శిస్తారు. పలుకుబడి పనిచేసేచోట పట్టు దొరుకుతుందివన పర్వతాలలో విహరించే అవకాశము.

నవంబర్:  జ్ఞాన సముపార్జన, భార్య ఆరోగ్య విషయములో చింతవైద్యులను సంప్రదించడంఔషధ సేవనం, అష్టమ కేతువు  యోగ భంగమే అయిననూ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనగలరు. మాస ద్వితీయార్థంలో  సౌఖ్యము, సంతోషము, ధనలాభముమనస్సును నిర్మలముగా ఉంచుకొనగలరు.

డిశెంబర్: విద్వాంసులతో సావాసము, విష్ణు భక్తి పరాయణతవిష్ణుచిత్తముమిత్రులతో బంధువులతో ఆనందము కలుగును. గతములో చేసిన అప్పుల బాధ కొంత వరకు తీరుతుంది కాని ఋణ విమోచన పూర్తిగా అవ్వదుఅష్టమ రాశిలో కుజసంచారము వలన శరీర సౌఖ్య లోపం జరుగుతుంది.

జనవరి: ధనవ్యయము, ప్రయాణములువస్త్ర లాభములు, ధనలాభములు, ధాన్యలాభము, విద్యలచే వినోదము సుఖించుట కలుగును. గృహ నిర్మాణములకు ధనవ్యయము, పాడి పశువులను, మొక్కలను పెంచుట కృషికి ప్రాధాన్యమిచ్చుట జరుగును. కీర్తి , సంతోషం, మనోధైర్యములుసత్కర్మాచరణలు కలుగును.

ఫిబ్రవరి: శరీర సౌఖ్యము తగ్గుట,, బంధువులకు సంతోషము, ఇల్లు కట్టించుట, ధన ధాన్యములు వృద్ధిరక్తపోటు, పెద్దలను గౌరవించి, ఆదరించి సౌఖ్యము కలిగించుటవ్యవసాయ పెట్టుబడులకు ధనము ఖర్చు, ధన ధాన్య వృద్ధిపొందుట, బంధువులకు సంతోషం కలిగించుట, సూర్య భగవానుని ఆరాధనచే  హృదయ సంబంధ ఆరోగ్యం.

మార్చి: పూర్వీకుల నుండి సంప్రాప్తించిన  ఆస్తిలో కొంత భాగము ఖర్చగుటఅధికార పరిధి విస్తరింపబడుట, సాహస కార్యములు చేయుట, క్రీడల యందు ఆసక్తి, శుక్రునికి భాగ్యమందు మరియూ ఉచ్ఛస్థితి కలుగుటచే వస్త్రలాభము, సన్మానములు, గౌరవం.