5.సింహ రాశి ఫలితములు

                               మఖ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1పాదము

              ఆదాయం 11                           వ్యయం - 5

            రాజపూజ్యం 6                          అవమానం 3

       ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11వరకు గురుడు 1ట సువర్ణమూర్తి, తదుపరి వత్సరమంతయు 2ట లోహమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 4ట తామ్రమూర్తిగాను, తదుపరి 5ట వత్సరమంతయు రజితమూర్తి. రాహువు 1కేతువు 7ట రజిత మూర్తులు. 

         కేవలం వీరికి ఈ సంవత్సరము గురుబలము మాత్రము కలదు. శని, రాహువు, కేతువు దోషులు. గురుబలంచే కార్యసిద్ధి, ధనాదాయం, ఆరోగ్యలోపం. ఇంటాబయటా కలహములు, మానసికశాంతి  లోపించును. తరచూ స్థాన చలనములు, మాతృవంశము వారితో విరోధములు, భూ గృహాది సేకరణ ఆలస్యంగా జరుగును.

         పుత్రమూలక క్లేశములు, విద్యార్థులు ఉత్తీర్ణత సాధింతురువ్యాపారస్తులు కొంతవరకు మాత్రం లాభ సాధన చేయుదురు. వ్యవసాయ దారులకు పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల వారికి, వృత్తి పనివారలకు ధనదాయమున్నను ఖర్చులు  అధికము.

         రాజకీయ నాయకులు తమ వాదనలను సభలో బాగుగా తెలుపుదురు. జన్మగురుని సంచార కాలములో ముఖ వర్చస్సు పెరుగుతుంది. ధన సంపాదన కష్టమవుతుంది. పనుల తొందర, ఉదర సంబంధమైన  స్వల్ప అనారోగ్యంఅజీర్ణం ఉంటుంది. మెడ నరములు నొప్పి, శిరో వేదన ఉంటాయినోటిపూత మొదలగు లక్షణములు ఉంటాయి.

         ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేస్తూ  ఉంటారు. మీ విషయ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. జ్ఞానాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఇది పరీక్షాకాలంఉద్యోగస్తులకు  ప్రభుత్వ విధానాలు అనుకూలించవు.

         రక్తపోటు, నిద్రలేమి లక్షణాలుంటాయి. వైద్యులతో పరీక్షలు చేయించుకుంటారు. అన్నీ అనుకూలమే. గత కొంతకాలంగా సంతానం గురించిన దిగులు పోతుంది. గృహమున ఖర్చు వాతావరణము ఉంటుంది. కోర్టు వ్యవహారములో పూర్వపు ఆస్తులు నెగ్గుట జరుగును. విశేష ఆరోగ్యము, గురుభక్తి, ఆర్థికపరంగా మంచి సమయం కాదు.

         ఈ రాశివారికి అదృష్టసంఖ్య 1. 3,4,5,9 సంఖ్యలూ, తేదీలు ఆది, మంగళ, బుధ వారములు కలసిన మరింత యోగము. రాహు, కేతు దోష నివారణకు దుర్గా, పార్వతి, స్తోత్ర పారాయణలు, చండీ సప్తశతి పారాయణలు, సుబ్రహ్మణ్యారాధన, మంగళ, శుక్రవార నియమములు  అనుసరించిన ఈ రాశి స్త్రీ పురుషాదులు కొంత వరకు మంచి ఫలితములను  పొందగలరు.