5.సింహ రాశి ఫలితములు

                               మఖ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1పాదము

              ఆదాయం 11                           వ్యయం - 5

            రాజపూజ్యం 6                          అవమానం 3

       ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11వరకు గురుడు 1ట సువర్ణమూర్తి, తదుపరి వత్సరమంతయు 2ట లోహమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 4ట తామ్రమూర్తిగాను, తదుపరి 5ట వత్సరమంతయు రజితమూర్తి. రాహువు 1కేతువు 7ట రజిత మూర్తులు. 

         కేవలం వీరికి ఈ సంవత్సరము గురుబలము మాత్రము కలదు. శని, రాహువు, కేతువు దోషులు. గురుబలంచే కార్యసిద్ధి, ధనాదాయం, ఆరోగ్యలోపం. ఇంటాబయటా కలహములు, మానసికశాంతి  లోపించును. తరచూ స్థాన చలనములు, మాతృవంశము వారితో విరోధములు, భూ గృహాది సేకరణ ఆలస్యంగా జరుగును.

         పుత్రమూలక క్లేశములు, విద్యార్థులు ఉత్తీర్ణత సాధింతురువ్యాపారస్తులు కొంతవరకు మాత్రం లాభ సాధన చేయుదురు. వ్యవసాయ దారులకు పాడి, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల వారికి, వృత్తి పనివారలకు ధనదాయమున్నను ఖర్చులు  అధికము.

         రాజకీయ నాయకులు తమ వాదనలను సభలో బాగుగా తెలుపుదురు. జన్మగురుని సంచార కాలములో ముఖ వర్చస్సు పెరుగుతుంది. ధన సంపాదన కష్టమవుతుంది. పనుల తొందర, ఉదర సంబంధమైన  స్వల్ప అనారోగ్యంఅజీర్ణం ఉంటుంది. మెడ నరములు నొప్పి, శిరో వేదన ఉంటాయినోటిపూత మొదలగు లక్షణములు ఉంటాయి.

         ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేస్తూ  ఉంటారు. మీ విషయ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. జ్ఞానాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఇది పరీక్షాకాలంఉద్యోగస్తులకు  ప్రభుత్వ విధానాలు అనుకూలించవు.

         రక్తపోటు, నిద్రలేమి లక్షణాలుంటాయి. వైద్యులతో పరీక్షలు చేయించుకుంటారు. అన్నీ అనుకూలమే. గత కొంతకాలంగా సంతానం గురించిన దిగులు పోతుంది. గృహమున ఖర్చు వాతావరణము ఉంటుంది. కోర్టు వ్యవహారములో పూర్వపు ఆస్తులు నెగ్గుట జరుగును. విశేష ఆరోగ్యము, గురుభక్తి, ఆర్థికపరంగా మంచి సమయం కాదు.

         ఈ రాశివారికి అదృష్టసంఖ్య 1. 3,4,5,9 సంఖ్యలూ, తేదీలు ఆది, మంగళ, బుధ వారములు కలసిన మరింత యోగము. రాహు, కేతు దోష నివారణకు దుర్గా, పార్వతి, స్తోత్ర పారాయణలు, చండీ సప్తశతి పారాయణలు, సుబ్రహ్మణ్యారాధన, మంగళ, శుక్రవార నియమములు  అనుసరించిన ఈ రాశి స్త్రీ పురుషాదులు కొంత వరకు మంచి ఫలితములను  పొందగలరు.


 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్: తనయందు అపరాధము లేకపోయిననూ కలహము సంభవించుట, తనయందు దోషము లేకున్ననూ ద్రవ్యము, పుణ్యము నశించును. లాభము తగ్గును. మనసున   ఆందోళనలు కలుగును. రాజపూజనము, కీర్తి పెరుగుట, ధనలాభము కలుగుట, పితృ మూలక ధన లాభములు కలుగుట.

మే: ఈ నెలలో ఆర్థికంగా  వెనుకబడతారువిందులకు, విహారాలకు డబ్బు ఖర్చు చేయరు. లెక్కచేయరు. పూర్వీకుల ఆస్తి విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. భూములు ధరలు  పెరిగాయనే  వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.. పది మందితో కలిసిపోతారుఅందర్ని గౌరవంగా చూస్తారు. కుటుంబ వాతావరణము  అనుకూలంగా ఉంటుంది.

జూన్: పనుల తొందర, పని వత్తిడి, కార్యభారము, అధికారుల ప్రశంసలు, ప్రమాదాల భారిన పడే అవకాశము, నోటిదురుసుతనము, వృత్తి నైపుణ్యతను  అభివృద్ధి చేయుట, ధన లాభమును పొందుట జరుగును.

జూలై: ఎంతో కాలంగా కొలిక్కిరాని  అపరిష్కృత  సమస్యలు సాధించగలుగుతారునిరుద్యోగులకు  ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగాలలో  ఉన్నవారికి ఉన్నతి కలుగుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులుమొదలగు వారికి లాభం కలుగుతుంది.   విద్యార్థులకు ఆశావహ వాతావరణం ఏర్పడుతుంది.

ఆగష్ట్: గృహమున శుభకార్య సందడి, అందరినీ  ఆదరణగా  చూడగలుగుతారుఅర్ధాష్టమ శని ప్రభావము ఇంకా  పీడిస్తునే ఉంటుంది. విందులు, వినోదములలో పాల్గొంటారు. దూరంగా ఉండి సంతానం గురించి మంచి వార్తలు వింటారు.

సెప్టెంబర్: జన్మరాశియందు రవి సంచార కాలం కోపము, ఉద్రేకము, మాటతొందర, ఇతరులను నిందించుట, నీచకార్యములు తల పెట్టుట జరుగును. విషప్రభావమునకు గురి అగుట, గాయములు బారిన పడుట మొదలగు  లక్షణములు ఉండును. మత్తు పదార్థములను సేవించుట, ధన వ్యయములు  చేయుదురు.

అక్టోబర్: ఆదాయమునకు మించిన  ఖర్చులుంటాయిపై అధికారుల నుండి ఆదరణ లభించదు. శ్రమ అధికంగా  ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక జీవనం ఎక్కువవుతుంది. ఉపాసన బలము  సిద్ధిస్తుంది.

నవంబర్: కార్యసిద్ధి కలుగుతుందిప్రతి పనిలోను ముందుకు దూసుకుపోతారుధైర్యము చేయడం వలన  కలిసివస్తుందిఆర్థిక స్థితి బాగుంటుందికుటుంబంలో అనారోగ్య వాతావరణం, భార్యామూలక అనారోగ్యంసుబ్రహ్మణ్య ఆరాధనలు మేలు.

డిసెంబర్: పనుల తొందర, త్రిప్పట అధికంగా ఉంటుంది. జ్ఞాన సముపార్జన మార్గాలను  ఎంచుకుంటారుఉదరమున అజీర్ణము, గ్యాస్ ,మంటలు ఉండవచ్చును. మనోభారము, నరముల నిసత్తువ కలుగ వచ్చును. అయితే ఆర్థికంగా  పరిపుష్ఠి.

జనవరి: ఆర్థికంగా బాగుంటుంది. సంతానం  నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం ఉంటుంది. ధన సహాయం  కలుగుతుంది. ధైర్యంగా ఉంటారు. ప్రతీ పనిలోను విజయం సాధిస్తారు. క్రీడలలో గుర్తింపు కలుగుతుందివిద్యార్థులకు మంచి సమయంవిద్యా వృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తారు.

ఫిబ్రవరి: శరీర సౌఖ్యము పొందుట, తలచిన కార్యములు నెరవేరుటమంచి సుఖము, గృహమున వస్త్రాభరణాదుల కొరకు ధనము వెచ్చించుట ద్రవ్యలాభము, ధాన్యాదుల అమ్మకము వలన లాభము కలుగును.

మార్చి: కుటుంబ  విషయాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తారు. ఖర్చులు అధికం అవుతాయి. ధనం నిల్వ తగ్గుతాయి.. దర్జాగా ఉండగలుగుతారు. బందు మిత్ర సమాగమము. ఇంట పండుగ వాతావరణం.