6.కన్యా రాశి ఫలితములు

ఉత్తర 2,3,4 పాదములు,హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1, 2పాదములు

        ఆదాయం - 14                           వ్యయం - 11

        రాజపూజ్యం - 2                          అవమానం - 6

           ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 12ట తామ్రమూర్తి, తదుపరి వత్సరమంతయును1ట తామ్రమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు3ట సువర్ణమూర్తిగానూ, తదుపరి 4ట వత్సరమంతయు లోహమూర్తి. రాహువు 12, కేతువు 6ట సువర్ణమూర్తులు.

         వ్యయ గురునిచే సంవత్సర ప్రారంభంలో శుభమూలక ధనవ్యయం. స్థానచలన, అనారోగ్య సూచనలు. ఆగస్ట్ 11 నుండి జన్మరాశి సంచారముచే శుభమూలక ధన వ్యయం, అనారోగ్యం, దైవ సందర్శనం. సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు  శనీ తృతీయరాశి సంచారముచే ధనలాభం. రాహువు వ్యయ సంచారముచే ఆపదలు, ధననష్టం, అనారోగ్యంకేతువు షష్ఠరాశి సంచారం సంతోషంశతృనాశనం గురు రాహు బలము సామాన్యముశని కేతువుల బలము కలదు. ఈ రాశి స్త్రీ పురుషాదులకుఏ రంగము వారికైనను సామాన్యఫలితములు. వ్యవసాయదారులకు రెండు పంటలు అతి కష్టముపై కొంత కలిసి వచ్చును. వ్యాపారులకు  నిలకడపై  కొంత కలిసి వచ్చును.

         పాడి పరిశ్రమ, మత్స్య, పౌల్ట్రీ, గృహ వినియోగము, తాపి, వడ్రంగి, కమ్మరం వారికి మధ్యమ కాలము. గృహములో శుభకార్యములు, అవివాహితులకు వివాహ ప్రాప్తి. రాజకీయ, వైద్య, విద్యారంగము, శిల్పులు, లాయర్లు , నట గాయకులు, క్రీడాకారులకు అతికష్టముపై రాణింపు. వీరికి  గురుడు  వ్యయస్థానమందు యుండుటచే గృహమున  కళ్యాణాది శుభకార్యములు  నిర్వర్తించెదరు. మంగళకరమగు వాతావరణము  గోచరించును. అందరిమీద పట్టు సాధించాలని తపన. వ్యవహార ప్రతిబంధకాలు, సౌఖ్యకరమగు కుటుంబ వాతావరణము, ఆకస్మిక ధన లాభము, అధికారము వృద్ధియగునుఉద్యోగ ఉన్నతి కలుగును. సమర్థత పెరుగును. ఆగస్ట్ తదుపరి పనుల తొందర, ఇతరులకై వృధాగా కాలము వెళ్ళబుచ్చడం, కుటుంబ వాతావరణం వీడి కొన్నిసార్లు బయట గడపడం, దూరప్రయాణములు  తప్పనిసరిగా చేయవలసి వస్తుంది.

       అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రములను సందర్శిస్తారు. జన్మగురుని  సంచార కాలంలో ప్రమాదముల నుండి బయటపడతారు. ప్రాణహాని ఉండదు. నరముల బలహీనత, నిస్సత్తువ.సదైవం పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ముందుకు సాగగలరు. విజయం సాధిస్తారు. ఇప్పుడు మీరు సాధించబోయే విజయం ముందువాళ్ళకి పునాదులు వేస్తుంది.

         జీవనం సుఖమయం అవుతుంది. రాహువు జన్మరాశి సంచార కాలములో చర్మవ్యాధులు, ఆర్థిక వనరుల తగ్గుదల, శత్రువర్గము నుంచి ప్రమాదము, భార్యకు అనారోగ్యం, జన్మ రాహువు ఉన్నంతకాలం త్రిప్పుట సదరు సంబంధ అనారోగ్యం, మానసిక ప్రశాంతత లేకుండుట, దోష పరిహరణార్థం మినుములు, ఉలవలు దానం  చేయునది. గణపతి ఆరాధన మీకు సర్వ అడ్డంకులను తొలగించి సర్వ శుభాలను కార్యసిద్ధిని కలిగిస్తుంది. స్వార్థం  కోసం ఇతరుల   ప్రయోజనాలను పణంగా  పెట్టి పనిచేయడం, ప్రజలను మోసం చేసి తద్వారా ధనము సంపాదించడం మత్తుమందుల వ్యాపారంలో  ధనం సంపాదించడం, విదేశీ సంచారం చేయడం అనవసర అధిక ప్రయాణాలు జన్మరాశిలో రాహువు సంచార కాలంలో జరుగు ఫలితములు.

         ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 5. 1,3,6,8 తేదీలు, సంఖ్యలు ఆది, బుధ, గురు , శనివారములు కలిసిన  యోగదాయకము. గురుదోష నివారణకు సుబ్రహ్మణ్యారాధన అమ్మవారికి కుంకుమ పూజలు ఆచరించిన మేలు జరుగును.