7.తులా రాశి ఫలితములు

చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు, విశాఖ1,2,3 పాదములు

             ఆదాయ - 11                     వ్యయం - 14

             రాజపూజ్యం - 5                 అవమానం - 6        

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 11ట రజితమూర్తి, తదుపరివత్సరమంతయు 12ట రజితమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 2ట రజితమూర్తిగానూ, తదుపరి 3ట వత్సరమంతయూ తామ్రమూర్తి. రాహువు11, కేతువు5ట లోహమూర్తులు.

         సంవత్సరాది నుండి ఆగస్ట్ 11 వరకు గురుబలం కలదు. తదుపరి సామాన్యం. సంవత్సరమంతయు రాహుబలము కలదు. సంవత్సరాంతములో శని బలము కలదు. సంవత్సరాది నుండి ఆగస్ట్ 11 వరకు ధనలాభము, కార్యసిద్ధి, సర్వత్ర విజయము. తదుపరి స్థానచలన సూచనలు . ఆరోగ్యభంగము, శస్త్రచికిత్సలు, రాహుబలముచే అపూర్వ ధనలాభము, సంతోషం. 2017 జనవరి 26 నుండి ఈ రాశివారికి ఏలినాటి శనిపూర్తి అగుటచే కొంత శని బలంచే ధనలాభం. కేతువు పంచమస్థాన సంచారంచే ధనవ్యయం. వీరికి గురుడు వ్యయ సంచారంలో శుభమూలక ధనవ్యయం. భూసంపాదన, గృహనిర్మాణ, వస్తుసేకరణ కొంత కలసి వచ్చును. చేసే వృత్తిలో స్థిరత్వాన్ని సాధించలేరు. అందరూ తనను గౌరవించాలనుకుంటారు.

                   అనవసర విషయాలలో శౌర్యము, ప్రతాపము చూపుతారు. స్థిరచిత్తం, ఏకాగ్రత చూపిస్తే మీకు మీరే సాటి. ఆర్థికముగా ముందంజంలో ఉంటారు. కుటుంబ ఉన్నతికి నూటికి నూరుపాళ్ళు కృషి చేస్తారు. కాలం కలిసివస్తుంది. మీరు తలబెట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. గాని తగిన ఫలితాన్ని ఇవ్వవు. ఏదో కుటుంబ అవసరములకుగాని, నిర్మాణములకు గాని కొంత పొలం అమ్మవలసి వస్తుంది. వీరికి గ్రహణం వీడిన సమయం. ఇది గత మూడు సంవత్సరాలుగా విద్యావిషయంలో కలిగిన లోపాన్ని సరిదిద్దుకుని ముందంజ వేస్తారు.ఆగస్ట్ 11 తదుపరి స్థానచలన సూచనలు.

         2017 జనవరి 26 వరకు అధిక ఖర్చులు, మనోనిబ్బరం లేకపోవుట, ఆరోగ్య భంగము, వివాహము కావలసిన స్త్రీ పురుషులకు  శుభములు జరుగును. విదేశీ ప్రయాణములు తటస్థించును. అన్ని రంగములవారు జాగరూకతతో మెలగవలసిన కాలము. విద్యార్థులు శ్రమాధిక్యతచే సామాన్య ఫలితములను  పొందగలుగుదురు. వ్యవసాయదారులకు, విద్యా, వైజ్ఞానిక, పౌల్ట్రీ, మత్స్య, వ్యాపార వర్గములవారికి మిశ్రమ ఫలితముల వైద్యులు, లాయర్లు, గాయకులు, మిశ్రమ ఫలితములు.

         ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. 5,7,9 తేదీలు, సంఖ్యలు, బుధ,శుక్ర, శనివారములు కలిసిన మరింత యోగించును. వ్యయగురు దోషనివారణకు శివునికి అభిషేకములు. దత్తాత్రేయ, శివ స్తోత్ర పారాయణలు ఆచరించవలయును.