7.తులా రాశి ఫలితములు

చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు, విశాఖ1,2,3 పాదములు

             ఆదాయ - 11                     వ్యయం - 14

             రాజపూజ్యం - 5                 అవమానం - 6        

         ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 11ట రజితమూర్తి, తదుపరివత్సరమంతయు 12ట రజితమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 2ట రజితమూర్తిగానూ, తదుపరి 3ట వత్సరమంతయూ తామ్రమూర్తి. రాహువు11, కేతువు5ట లోహమూర్తులు.

         సంవత్సరాది నుండి ఆగస్ట్ 11 వరకు గురుబలం కలదు. తదుపరి సామాన్యం. సంవత్సరమంతయు రాహుబలము కలదు. సంవత్సరాంతములో శని బలము కలదు. సంవత్సరాది నుండి ఆగస్ట్ 11 వరకు ధనలాభము, కార్యసిద్ధి, సర్వత్ర విజయము. తదుపరి స్థానచలన సూచనలు . ఆరోగ్యభంగము, శస్త్రచికిత్సలు, రాహుబలముచే అపూర్వ ధనలాభము, సంతోషం. 2017 జనవరి 26 నుండి ఈ రాశివారికి ఏలినాటి శనిపూర్తి అగుటచే కొంత శని బలంచే ధనలాభం. కేతువు పంచమస్థాన సంచారంచే ధనవ్యయం. వీరికి గురుడు వ్యయ సంచారంలో శుభమూలక ధనవ్యయం. భూసంపాదన, గృహనిర్మాణ, వస్తుసేకరణ కొంత కలసి వచ్చును. చేసే వృత్తిలో స్థిరత్వాన్ని సాధించలేరు. అందరూ తనను గౌరవించాలనుకుంటారు.

                   అనవసర విషయాలలో శౌర్యము, ప్రతాపము చూపుతారు. స్థిరచిత్తం, ఏకాగ్రత చూపిస్తే మీకు మీరే సాటి. ఆర్థికముగా ముందంజంలో ఉంటారు. కుటుంబ ఉన్నతికి నూటికి నూరుపాళ్ళు కృషి చేస్తారు. కాలం కలిసివస్తుంది. మీరు తలబెట్టిన ప్రాజెక్టులు పూర్తవుతాయి. గాని తగిన ఫలితాన్ని ఇవ్వవు. ఏదో కుటుంబ అవసరములకుగాని, నిర్మాణములకు గాని కొంత పొలం అమ్మవలసి వస్తుంది. వీరికి గ్రహణం వీడిన సమయం. ఇది గత మూడు సంవత్సరాలుగా విద్యావిషయంలో కలిగిన లోపాన్ని సరిదిద్దుకుని ముందంజ వేస్తారు.ఆగస్ట్ 11 తదుపరి స్థానచలన సూచనలు.

         2017 జనవరి 26 వరకు అధిక ఖర్చులు, మనోనిబ్బరం లేకపోవుట, ఆరోగ్య భంగము, వివాహము కావలసిన స్త్రీ పురుషులకు  శుభములు జరుగును. విదేశీ ప్రయాణములు తటస్థించును. అన్ని రంగములవారు జాగరూకతతో మెలగవలసిన కాలము. విద్యార్థులు శ్రమాధిక్యతచే సామాన్య ఫలితములను  పొందగలుగుదురు. వ్యవసాయదారులకు, విద్యా, వైజ్ఞానిక, పౌల్ట్రీ, మత్స్య, వ్యాపార వర్గములవారికి మిశ్రమ ఫలితముల వైద్యులు, లాయర్లు, గాయకులు, మిశ్రమ ఫలితములు.

         ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. 5,7,9 తేదీలు, సంఖ్యలు, బుధ,శుక్ర, శనివారములు కలిసిన మరింత యోగించును. వ్యయగురు దోషనివారణకు శివునికి అభిషేకములు. దత్తాత్రేయ, శివ స్తోత్ర పారాయణలు ఆచరించవలయును.


 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్: తన యింటికి గాని, క్షేత్రమునకు గాని కలిగిన యెల్లరితో మరియు తనతో చేరియున్న వారితో మిక్కిలి ద్వేషమును, భార్యకు బిడ్డలకు అనారోగ్యం, ఉత్సాహభంగంచేయు కార్యములను చేయుట సంభవించును వాగ్వివాదములు.

మే: ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కోపం వలన బంధు విరోధం, అనాలోచితంగా వ్యవహరించడం .

జూన్: అవకాశవాదం, ఆత్మస్తుతి, పరనిందలు చేయుదురు. వాక్ స్థంభన, ఇతరులపై విరుచుకుపడడం, కారణము లేక విరోధము,ధన, వస్త్ర, ధాన్య లాభములు, విద్యలచే వినోదము, పిల్లల విద్యావిషయములకై వ్యర్థఖర్చులు చేయుదురు.

జూలై: ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతికి అవకాశం ఉంది. స్థాన మార్పు సూచన కలదు. శరీరమున అగ్ని సంబంధ అనారోగ్యము, వ్రణములు కలుగుతాయిఎముకలు కటకటలాడతాయి. వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో  అధిక పోటీ వత్తిడి ఎదుర్కొంటారు.

ఆగస్ట్: శరీర ఆరోగ్యమునకై ధనము ఖర్చుఊపిరితిత్తులు, రక్తపోటు, అనారోగ్యసమస్యలు ఎదురవుతాయి. రొయ్యలు మరియు చేపల చెరువుల వ్యాపారస్తులకు మంచి లాభం కలుగుతుంది. బంధుమిత్రుల సహకారములు లభిస్తాయి.యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

సెప్టెంబర్: ఉద్యోగ రీత్యా మార్పులుండును. మాట వదిలేయడం అనర్థాన్నివ్వగలదు. జన్మరాశిలో గురు సంచారము  యోగదాయకమేఅయినను ఆరోగ్య విషయముల్లో జాగ్రత్త నిద్రలేమి. గ్రంథపఠనం  చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.

అక్టోబర్: గ్రహస్థితి అనుకూలము. స్టాక్ వ్యాపారులకు  సరుకుల నిల్వలు పెరిగి తద్వారా విశేష ధనలాభము. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. ధనం ఖర్చయినా సౌఖ్యము పెరుగును. మత్తు మందుల వ్యాపారులకు అధిక లాభములు.

నవంబర్: ఆకస్మిక ధనలాభంశుభమునకై ధనవ్యయం కుటుంబ విషయాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. ధైర్య సాహసములు కలిసివస్తాయి. జన్మరాశిలో రవి సంచారము వల్ల ఒక్కొక్కప్పుడు  మాట తొందర ఉన్నా సరిదిద్దుకోగలరు.

డిసెంబర్: సంతాన విషయంలో దిగులుఆకస్మిక ధనలాభం, గృహమున మిశ్రమ వాతావరణము. శయ్యా భోగము అలంకార ప్రాప్తి  కలుగుతాయి. నోటి దురుసుతనం ఇబ్బంది పెడుతుందితదుపరి బాధపడతారు. నూతన ఆవిష్కరణలు చేయుదురు.

జనవరి: ఆకస్మిక ధన లాభము, ధైర్యంగా, దర్జాగా, వ్యవహరించడం కార్యానుకూలత సోదరుల నుంచి సహాయ ప్రోత్సాహకాలు ఉంటాయి. వారి అభివృద్ధికి పాల్పడతారు. పూర్వపు స్నేహితుల సహాయంతోను కార్యజయం.సొమ్ము చేతికి వస్తుంది.

ఫిబ్రవరి: ధనాదాయానికి లోటుండదు. అయితే కుటుంబ వాతావరణం అంతగా బాగుండదు. భార్యామూలక అనారోగ్యము, పాదములకు సంబంధించిన చికిత్సలకు  వైద్యులను సంప్రదిస్తారు. అనేక రకాల వృత్తులను సమర్థవంతముగా నిర్వర్తించగలుగుతారు. ఆకస్మిక ధనలాభము, భూముల మీద, షేర్ల మీద పెట్టిన  పెట్టుబడులు  లాభిస్తాయి.

మార్చి: చేతివృత్తివారలకు అనేక రెట్లు లాభం. చేతినిండా ధనం, ధనములకు లోటులేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చేపలురొయ్యల వ్యాపారులకు సువర్ణావకాశం. షేర్లు కీడా అనుకూలిస్తాయి. ధనాదాయము పెరుగుతుంది.