8.వృశ్చిక రాశి ఫలితములు

విశాఖ 4వపాదము,అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ1,2,3,4 పాదములు

        ఆదాయం - 2              వ్యయం - 3

        రాజపూజ్యం -1            అవమానం - 2

        ఈ రాశివారికి  2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 10ట లోహమూర్తి, తదుపరి వత్సరమంతయును 11ట సువర్ణమూర్తి, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు1ట లోహమూర్తిగానూ, తదుపరి 2ట వత్సరమంతయు రజితమూర్తి. రాహువు10, కేతువు 4ట సువర్ణమూర్తులు.

          వీరికి సంవత్సర ప్రారంభము నుండి సంవత్సరాంతము వరకు గురుబలం కలదు ఏల్నాటి శని జన్మ, కుటుంబ స్థానములలో సంచార దోషం. రాహువు రాజ్యస్థాన సంచారం. కేతువు అర్ధాష్టమ స్థానసంచార దోషం. వీరు గురుబలముచే ఎంతటి కార్యములనైన పూర్తిచేయగలరు. మానసిక ఆనందం, ధనలాభం, శని దోషముచే స్థానచలన సూచనలు, ఆరోగ్యలోపం,కుటుంబపోరు, ధననష్టం. రాహు దోషముచే  అనవసర వాదనలు, పూర్తి కావలసిన పనులు వాయిదాపడుట. కేతు దోషముచే మాతృ వంశమువారితో స్పర్ధలు, ధననష్ట, సుఖలోపం, వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసివచ్చును. ఉద్యోగస్తులకు, అధికారులకు ప్రశంసలు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలరు. రాజకీయనాయకులు ప్రజామన్ననలు పొందగలుగుదురు. వ్యాపార, వైద్య, వైజ్ఞానిక, మత్స్య, పౌల్ట్రీ, పాడిపరిశ్రమ, కళారంగముల వారికి, క్రీడాకారులకు ప్రోత్సాహము కలిగి లాభములను పొందుదురు.

          ఈరాశివారికి గురుడు సంవత్సరాది నుండి ఆగస్ట్11 వరకు రాజ్యగురుడు తదుపరి సంవత్సరాంతము వరకు లాభస్థానగురుడు, శని సంవత్సరాది నుండి 2017 జనవరి26 వరకు జన్మశని దోషం. రాహువు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దశమస్థాన సంచారం. కేతువు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు తృతీయస్థాన సంచారం. ఈ కాలములో ధనలాభం, ప్రశంసలను మన్నలను పొందుదురు. శని జన్మరాశి సంచారకాలంలో స్థానచలన సూచనలు. అనారోగ్యం,ధననష్టం, రాహువు రాజ్యస్థాన సంచారంచే ధనలాభం, కేతువు తృతీయస్థాన సంచారముచే మానసిక విచారం, దుఃఖం, సోదరహాని. ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమం. వ్యవసాయదారులకు రెండుపంటలు కలసివచ్చును. అవివాహితులకు వివాహప్రాప్తి. గృహ నిర్మాణములు పూర్తియగును. దైవకార్యములందు పాల్గొనెదరు. శని, ద్వాదశ, జన్మరాశి సంచారకాలములో  ఆరోగ్యభంగము, త్రిప్పట, స్థానచలన సూచనలు, అకారణ విరోధములు,మనస్థిమితము లేకపోవుట,అన్నిరంగాలవారికి పోటీతత్వము  ఎదురగును. రాహుబలముచే కొంత ధనార్జన, కేతువుచే మానసిక విచారం.

         ఈ రాశివారికి అదృష్టసంఖ్య – 9. 1,2,3,4 తేదీలు సంఖ్యలు. ఆది,సోమ,మంగళ,గురువారములు కలిసిన యోగదాయకము. ఆశ్వరునికి తైలాభిషేకం, శనివార నియమాలు పాటించుట, ఆంజనేయ, విష్ణుస్తోత్ర పారాయణ చేసిన మేలు. శనిదోషము తొలగుటకు సుబ్రహ్మణ్య, పార్వతీ ఆరాధనలు, చండీపారాయణ ఆచరించిన మేలు.