నెలవారీ ఫలితములు

ఏప్రిల్: నెలలో ఉత్తరార్థం అనుకూలం. ముఖవర్చస్సు, యత్నకార్యసిద్ధి, శరీర సుఖసౌక్యములు, సంతోషము, వస్త్ర, ధాన్య లాభములు వృద్ధి. జన్మరాశి యందు కుజ శనుల సంచారం జరుగుచున్ననూ ధనలాభము, మనస్సున ధైర్యము, విద్యలచే వినోదము.

మే: జన్మకుజ సంచారముచే ఉష్ణ జ్వరము ఎముకలు కటకటలాడుట, శరీరమున కత్తిచేతగాని, శస్త్రముచేత గాని గాయములు. శరీరమున ఉష్ణసంబంధ కురుపులు వేయును. కాని ధైర్య సాహసములతో పనిచేయుదురు.కార్యసాధకులగుదురు.

జూన్: వృత్తి విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ చిత్తచాంచల్యమునకు ఇబ్బందులు, వ్యర్ధముగా సంచరించుట, సోమరితనము ఉండును.

జూలై: ఉద్యోగయోగము, దూరప్రాంతములలో కుటుంబమును వదిలి పనిచేయవలసివచ్చుట, ధనలాభము. ఉన్నత విద్యలకై చేయు ప్రయత్నములు ఫలించును. ప్రముఖ విద్యాసంస్థల్లో గుర్తింపు. పదిమందిలో గుర్తింపు, గౌరవము, ఆదరణ కలుగును.

ఆగస్ట్: మిశ్రమ ఫలితములు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు . బయట పడగలుగుతారు. మిత్రుల సహాయము. కమ్మరము, ఇనుము, నువ్వులు, వంటనూనెలు , గ్యాస్ వెల్డింగ్, కాంట్రాక్ట్, స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక పరిపృష్ఠికలుగుతుంది.

సెప్టెంబర్: వీరికి ఈ మాసములో లాభస్థానమందు నీచోచ్చగ్రహములు. ఆర్ధికంగా లాభిస్తుంది. అయినా జన్మరాశిలో శని సంచారం వలన ఏదో ఒక అనర్థం ఉంటూనే ఉంటుంది. సమయస్ఫూర్తి అవసరం. వ్యాపారస్తులకు ప్రతికూలం. జాగ్రత్త అవసరం.

అక్టోబర్: వీరికి రవి, బుధులు అధిక లాభమును కలుగ చేయుదురు. వ్యాపారములు అనుకూలముమట్టిపనులు, కుమ్మరి, ఇటుక, సిమెంటు, ఇనుము వ్యాపారులకు ధనదాయం పెరుగును. కుటుంబ వాతావరణము అనుకూలముగా ఉండును.

నవంబర్: విద్యావిషయంగా ముందంజ వేసే సమయమిది. పరీక్షలలో కృషిచేసి రాణిస్తారు. మెదడుకు పదును పెడతారు. గతంలో చేసిన ఋణాలు తీర్చుకునే అవకాశం వస్తుంది. ధనాదాయం పెరుగుతుంది.

డిసెంబర్: బంధువుల గురించి బాగా ఆలోచిస్తారు. అంతర్మధనం చెందుతారు. కుటుంబ సభ్యల ప్రవర్తనకు నొచ్చుకుంటారు. స్మశాన సందర్శనం, భూమి, ఇండ్లపై ఆదాయం బాగా వస్తుంది. భూ, గృహమార్పులు. వ్యవసాయదారులకు ఆర్థికలాభం విద్యార్థులకు మనోవికాసము, బుద్ధి కుశలత గల్గి విద్యావిషయమై ముందంజ.

జనవరి:జ్ఞానసముపార్జన వృద్ధికలుగుతాయివ్యవహార ప్రతిబంధకాలు మరియు ఇతరత్రా కొన్నిరకాల చికాకులు ఎదుర్కోక తప్పదు. గృహ వాతావరణం చాలా అనుకూలము. కుటుంబసౌఖ్యము, దానములు చేయుట, భోగభాగ్యాలు అనుభవించుట.

ఫిబ్రవరి: కుటుంబంలో వివాహాలు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ. దానికి తగిన కృషి చేస్తారు. ఇంటి గౌరవం గురించి కృషి చేస్తారు. సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యలలో పిల్లలు అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.

మార్చి: విద్యార్థులు సమర్థవంతంగా చదివి సరస్వతీ కటాక్షం పొంది పరీక్షలలో విజయం సాధిస్తారు. వేద, జ్యోతిష్య, ఉన్నత విద్య కలసి రావడం, మంచి అవకాశములు ఆదరణ, ఆధ్యాత్మిక భావం ఉన్నతిలోనికి వచ్చుట, సంపూర్ణ దైవబలం . కుటుంబమున పండుగ వాతావరణము నెలకొంటుంది.