9.ధనూ రాశి ఫలితములు

మూల1,2,3,4 పాదములు, పూర్వాషాఢ1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వపాదము

   ఆదాయం - 5                    వ్యయం - 14

   రాజపూజ్యం -4                  అవమానం - 2

                   ఈ రాశివారికి 2016 ఆగస్ట్ 11 వరకు గురుడు 9ట తామ్రమూర్తి తదుపరి వత్సరమంతయును 10ట లోహమూర్తి. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 12ట తామ్రమూర్తిగాను, తదుపరి 1ట వత్సరమంతయు సువర్ణమూర్తి. రాహువు 9ట కేతువు 3ట తామ్రమూర్తులు.

         జన్మరాశి శనిలో సంచారకాలము  దోషము. రాహువు సంవత్సరమంతయు భాగ్యస్థానమందు సంచరించును. వీరు గురు బలముచే ఎంతటి కార్యమునైన విజయవంతముగా పూర్తి చేయగలరు.ఈ కాలంలో ధనలాభం, ఉన్నత అధికారుల ప్రశంసలను పొందెదరు. ఉద్యోగులపై అధికారుల మెప్పు పొందెదరు. ఏ వృత్తివారికైనను ధనలాభము, కార్యసిద్ధి కలుగును. శని వ్యయరాశి సంచారకాలములో స్థానచలన సూచనలు, అనారోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యముకై జాగ్రత్తలు తీసుకొనుట, ధనము ఖర్చు అగుట, మొదలైన ఫలితములుండును.

         రాహుకేతువుల ప్రభావము ఈ రాశివారికి అనుకూలము. ధనలాభములు, మానసికసంతోషము, ముఖ్యముగా వైద్య, ఫార్మసీ మత్తుమందులు (ఎనస్తీషియా) విభాగముల వారికి విపరీత లాభములుండును. సోదర మూలకముగా ఉత్తమ ఫలితములు ఉండును. రాజకీయ నాయకులు సన్మానములు  పొందెదరు. అనుకూల సమయం. అధికారుల ప్రశంసలకు పాత్రులగుదురు.

         న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులకు కాలము కలిసి వచ్చును. లాభార్జన చేయుదురు. అవివాహితులకు వివాహమగును. తలపెట్టిన గృహనిర్మాణములను సమర్థవంతముగా పూర్తిచేయుదురు. శని ద్వాదశ జన్మ స్థానములో సంచారము జరుగునప్పుడు త్రిప్పట, వృధా ధనవ్యయము, కాలయాపన, చింత, దేహారోగ్యము, ఎముకల చికిత్స మొదలగు ఫలితములుండును.

              స్థాన చలన, స్థానభంగ సూచనలుండును. అకారణ విరోధములు, బంధుమిత్రద్వేషములు, మనస్థిమితము లేకపోవుట, ప్రతిరంగములోని వారికి పోటీతత్త్వము ఎదురగుచుండును. రాహుబలము, ధనార్జన యుండును.

         ఈ రాశివారికి అదృష్టసంఖ్య 3. 1,2,5,9 తేదీలు, సంఖ్యలు, ఆది,బుధ, గురువారాలు కలిసిన యోగకారకములు . శనిదోష నివారణకు  ఈశ్వరాభిషేకములు, మందపల్లిలో శనైశ్చరునికి తైలాభిషేకములు. శనివార  నియమములు, ఆంజనేయ, విష్ణు స్తోత్ర పారాయణలు చేసిన మేలు కలుగును. సుబ్రహ్మణ్యారాధనలు కావించిన మేలు కలుగును. కేతు దోషము తొలగుటకు సుబ్రహ్మణ్య, పార్వతీ ఆరాధనలు, చండీ పారాయణలు కావించిన  మేలు.


 

నెలవారీ ఫలితములు

ఏప్రిల్: శరీర అలసత్వము, సోమరితనము, హృదయసంకటము, స్నేహితుల వలన కష్టము, వ్యయము, బుద్ధిస్థైర్యములు లేకుండుట, శరీరపీడ, త్రిప్పట, బంధు, మిత్రులతో సంవాదము, దేశాంతర వాసము, అనారోగ్యము వలన మనోవేదన.

మే: రియల్ ఎస్టేట్ వ్యాపారముతో పాటు ఇతర వ్యాపారములు అనుకూలించును. ఉన్నత విద్యలకు అవకాశము. దేశాంతర ప్రయాణములకు యత్నములు, తార్కికముగా బోధించే శక్తి పెరుగును. రసాయన శాస్త్రములు తర్కములో పట్టుపెరుగును.

జూన్: ధనవ్యయం,మర్యాద లోపము, తండ్రితాలూకు ధనాగమనం, కులాచారమును తప్పక పాటించి ఉత్తమ ఫలితములను సాధించగలరు. ఉద్యోగస్తులకు పదోన్నతి శిల్పవిద్య, ఆర్కిటెక్చర్ వారికి విశేష యోగములు, ఇన్ కమ్ టాక్స్ సంబంధదాడులు.

జూలై: అధిక ధనలాభము, భూమూలకు ధనవ్యయము, దూర ప్రాంతములలో ఎర్రటి భూములు కొనుగోలు, ఆరోగ్యము, ద్రవ్యలాభము, సంతోషము, వస్త్రాభరణముల అలంకారసిద్ధి, యత్నకార్యసిద్ధి, పోయిన వస్తువులు దొరుకుట.

ఆగస్ట్:  ధనవ్యయము, ఆరోగ్యం అంతంతమాత్రం. సోమరిగా మారే సమయం, వృథా ఖర్చులు, సమాజంలో మంచి పనులు చేయాలని సంకల్పం మాత్రం కలుగుతుంది. పరోపకారం. ఆగస్ట్ 10తదుపరి అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సెప్టెంబర్: ఈ మాసములో ఉద్యోగోన్నతి. మీరు తలపెట్టిన కార్యక్రమములుమంచి ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో  లాభము కలుగుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. మీరు చేసే ధార్మిక కార్యక్రమములు పదిమందినీ ఆకర్షిస్తాయి.

అక్టోబర్:  గృహమున  అగ్నిప్రమాదములు జరిగే అవకాశము. జాగ్రత్త అవసరము. ఢాంబికములకు పోయి ధనవ్యయం. వృత్తి వ్యాపారాలలో అనుకూలత. షేర్లు, రొయ్యల చెరువులు, నీటి సంబంధ వ్యాపారాలకు లాభిస్తుంది. నూతన వస్తు, ధనలాభము.

నవంబర్: ఆటలు, సాహస కృత్యాలు, మొదలైన విషయాలలో రాణిస్తారు. ఉద్యోగప్రాప్తి. సకలైశ్వర్యాలు కలుగుదునుఉష్ణసంబంధ అనారోగ్యం, జననావయవాలు, ఉదర సంబంధ వ్యాధులకు   పరీక్ష, చికిత్స జరుగు అవకాశంలేక  గాయాలు బారిన పడతారు.

డిసెంబర్:  ఉద్యోగులకు శుభవార్త. అధికారులనుండి ప్రశంసలు. చేసిన పని కలిసి వస్తుంది. సమాజ అవసరములకు కృషిచేస్తారు. అందరి మన్ననలను పొందుతారు. నిరుద్యోగులకు  శుభసూచన. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంబంధ ఉద్యోగములు వస్తాయి.

జనవరి: ఉన్నతాధికారుల సందర్శన, వారి అనుగ్రహము కలుగుట, ఉద్యోగస్తులకు ఉన్నతి, చేసే ప్రతి పనీ కలిసి వస్తుంది. అప్పుడప్పుడు వత్తిడి మూలంగా కోపతాపాలకు గురి అవుతారు. అనుకున్నది సాధించగలుగుతారు. ధనవ్యయము కూడా జరుగుతుంది.

ఫిబ్రవరి: రియల్ ఎస్టేట్ వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. అధికలాభము, చేతినిండా ధనము చేకూరుతుంది.. వృత్తివ్యాపారాలలో చిక్కులు, ఇబ్బందులు అధిగమించగలరుఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యవసాయము లాభిస్తుంది.

మార్చి: కార్యవిలంబనము జరుగును. అనుకున్నపనులు ఆలస్యమవుతాయి. గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ఇష్టదేవతా సందర్శనం ఆలస్యమవుందిఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మాట తొందర మీ  వ్యాపారాన్ని   దెబ్బతీయవచ్చు. నెలాఖరులో ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి. చేతి నిండా డబ్బు సంపాదిస్తారు. పంట వృత్తుల వారికి అధిక ఆదాయం లభిస్తుంది.