నెలవారీ ఫలితములు

ఏప్రిల్: పూర్వార్థము అనుకూలం. తదుపరి స్వల్ప అనారోగ్యం, హృదయం సంకటం, ఇంటిలో చికాకులు, సుఖము లేకుండుట, భోజన సౌఖ్యము లేకుండుట, ప్రయాణము చెడుట, ధనలాభము, భూమి కొనుగోలు చేయుట వలన లాభము, ధైర్యము.

మే: యత్నకార్యసిద్ధి, శరీరసౌఖ్యము, ఆరోగ్యమును కలుగును, తల్లికి మాతృవర్గము వారికి ఆనందము, సంతోషము, ధన ధాన్యములు వృద్ధి పొందుట, స్వబుద్ధిచే  ఉపక్రమించబడిన కార్యములు సిద్ధించుట ఇవి కలుగును.

జూన్:  మనో చాంచల్యము, బుద్ధి భ్రంశము, పనులకు ఆటంకము, బంధువైరము. విద్యార్థులకు గణిత విషయమై ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివి సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితములు. గాంభీర్యత పెరుగుతుంది.

జూలై: ప్రయత్నము మీద కార్యసాధన, సుఖ, సంతోషములు, వస్త్రాభరణ లాభముకొన్ని సమయములలో వ్యవహార ప్రతిబంధకములు ఉన్ననూ జయించుకుని రాగలరు. విద్యలచే వినోదపడుతూ సుఖించుట, పండిత గోష్టి మొదలగు ఫలితములు కలుగును.

ఆగస్ట్: అనేక రకముల వ్యాపారములపై లాభం ప్రారంభంలో వస్తుంది. తదుపరి లాభం సన్నగిల్లింది. ధాన్యం కమీషన్ వ్యాపారంలో  కలసివస్తుంది. ఇతరత్రా వృత్తులు, చేతివృత్తుల వారికి కలిసి వస్తాయి. ఇంట్లో ఇల్లు, పొరుగింట్లో పొల్లు చందంగా ఉంటారు. కళత్ర ఆరోగ్యం విషయమై శ్రద్ధ అవసరం.

సెప్టెంబర్: కొంత మేరకు ఆరోగ్య లోపము కలుగుతుంది. అయితే గురుబలము వలన సౌఖ్యాన్ని పొందుతారు. సంతానం  నుంచి  అభివృద్ధికి సంబంధించిన శుభపరిణామాలు మిమ్ములను ఆనందపరుస్తాయి. అదృష్టము కలిసివస్తుంది. ధనలాభము కలుగుతుంది.

అక్టోబర్: వ్యవహార ప్రతిబంధకాలు పెరుగుతాయి. అన్ని రకముల వృత్తుల వారికి బద్ధకము, అశ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వృద్ధి కుంటుపడుతుంది. ఎలక్ట్రానిక్స్ ఆటోమేటిక్ వస్తువుల అమ్మకం దార్లకు లాభిస్తుంది. ధన సంపాదన, తగిన ఖర్చులు.

నవంబర్: దైవ సహాయము లభిస్తుంది. ఆర్థికముగా రాణిస్తారు. కుటుంబ విషయాలలో కొంత నయముగా ఉంటుంది. ఉపాధికి అవకాశములు పెరుగుతాయి. అన్నిరంగాల వారు రాణిస్తారు.

డిసెంబర్: రైసుమిల్లు, ధాన్యం కమీషన్ వ్యాపారులు కాకులను కొట్టి గ్రద్దలకు వేయవలసి వస్తుంది. పట్టుదలతో కార్యసాధన. అలంకార, కాస్మటిక్స్, సబ్బులు, మొదలగు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది.ఉద్యోగోన్నతి, మిత్రుల సహకారం.

జనవరి: ధాన్యమూలక ఆదాయం వస్తుంది. వీరు భూములకు సంబంధించిన మార్పులు, వ్యవసాయము కలసి వస్తుంది. భూముల క్రయ విక్రయముల వలన  లాభపడతారు. గ్రహస్థితి, గురుబలము బాగుంది. చేతినిండా ధనం ఉంటుంది.

ఫిబ్రవరి: ఇతరులచే చాకచక్యముగా పనిచేయించగలరు. కార్యభారాన్ని మోయగలరు. వ్యవహార ప్రతిబంధకములు.ధనవ్యయము, వత్తిడిని  అధిగమించగలుగుతారు. భూ గృహ సంబంధిత ఆదాయం. బాకీలు వసూలు, ఫైనాన్స్ వ్యాపారం కలసి వస్తుంది.

మార్చి: స్వల్ప అనారోగ్యము. మీ వాహనములు చోరుల పాలు అగుటకు అవకాశము. కొన్ని విషయాలలో మొండితనం వల్ల సమస్యలు. మానసిక క్షోభ కాముకత్వంధనవ్యయము అగును.