నెలవారీ ఫలితములు

ఏప్రిల్: నీచ పనులకు పాల్పడుట. వ్యక్తులతో అంతంత మాత్రంగా వుండుట మంచిది. నిత్య సంతోషము, ఆరోగ్యము, బంధుమిత్ర సమాగమము, ధనలాభము, ఉత్తరార్థంలో మేలు. మానసికోల్లాసనము, ధనప్రాప్తి, పుత్రసౌఖ్యము, ఇష్టకార్య సిద్ధి.

మే: క్రమశిక్షణతో కార్యసాధన. ఇతరులకు తగిన పని కల్పించి లాభము పొందగలరు. సత్సంభాషణ. గంభీర్యమును ప్రదర్శించగలరు. పదిమందిపై అధికారమును ప్రదర్శించుట, చెలాయించుట జరుగును.

జూన్: బంధు విరోధము, మనస్థాపము, బుద్ధిజాడ్యము, మతిమరుపు. జన్మరాశిలో కేతువు మిశ్రమఫలితం. ఆధ్యాత్మిక, దైవిక శక్తులను పెంపొందించుకుంటారు. కొన్ని విషయాలలో గ్రంథపఠనాశక్తి పెరుగును. గృహసౌఖ్యం, గృహమును ఏర్పరుచుకొనుట.

జూలై: సంతానం వృద్ధిలోకి వచ్చుట, వారి తెలివితేటలు, మేధాశక్తిని నిరూపించుకొనే అవకాశములు ఫలిస్తాయి. దేశంలో ఉన్నతవిద్యా స్థానాలలో విద్యావకాశం, వ్యవసాయదారులకు వృద్ధి జరుగుతుంది.

ఆగస్ట్: ఉత్తరార్థంలో అనారోగ్యం, శ్వాసకోశ సంబంధ పరీక్షలు, వైద్యుల సలహాలు తీసుకుంటారు. అమృతఘడియాలలో ఔషధ సేవనం మంచిది. దైవానుగ్రహం ఉంది. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరం. నెలలో రెండవభాగం బాగుంటుంది.

సెప్టెంబర్: కొన్ని విషయాలలో యితరులను శాసించి  వ్యవస్థను గాడిలో పెట్టగలరు. క్రింది, పై  అధికారులతో సంప్రదింపులు జరుపుచూ సత్సంబంధాలను కొనసాగిస్తారుశ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు పొందడం, ప్రమాదం ఉండదు.
అక్టోబర్: సమస్త సంపదలు, ధనధిక్యత, శుభకార్యాచరణ, విశేషమైన కార్యాలలో పాల్గొనుట, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. మీరు చేసే పనులకు విశేషమైన ఆదరణ,గుర్తింపు, సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయములు. అందరి మన్ననలు, ప్రశంసలు.

నవంబర్: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. నిశ్చలమైన దైవభక్తికి మార్గం  ఏర్పడుతుంది. వేదపఠన,శ్రవణమును ఆస్వాదిస్తారు. పునీతులవుతారు. వ్యాపారస్తులకు కలసివస్తుంది. విద్యార్థులు  శ్రమ పడవలసి వస్తుంది. సోమరితనము విడనాడాలి.

డిసెంబర్: స్వల్ప అనారోగ్యం. జలుబు, శ్లేష్మ సంబంధ, శ్వాసకోశ సంబంధ చికిత్సలు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు బాగా కలసి వస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేయగలరు.

జనవరి: మొదటి వారములో  ధనాదాయము. నెలాఖరులో ధనవ్యయము. సంగీత, నృత్య, కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిపుష్టి,కుటుంబ సౌఖ్యము, ఇష్టదేవత  సందర్శనము. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఫిబ్రవరి: వ్యవసాయ రీత్యా ఆదాయం . తగిన ధనవ్యయం. అష్టమ స్థానంలో గురుడు వక్రించుటచే దోషపరిహారార్థం గురువారం శెనగలు దానం చేయుట.ఆరోగ్యం కుదుట పడును. కుటుంబ సభ్యుల ఆడంబరములకై ధనవ్యయము, వినోద కాలక్షేపములు.

మార్చి: పనుల ఒత్తిడి, తొందరపాటు చర్యలు, ఆందోళన  ఒక్కోసారి తీవ్ర కోపము, అనాలోచిత నిర్ణయాలు, జన్మరాశి యందు కేతువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించును. సోదర మూలక సహాయము, అభివృద్ధికలుగుతుంది.