మకర సంక్రమణ - పురుష లక్షణమ్

         శ్రీ దుర్ముఖి నామ సం।।ర పుష్య బహుళ విదియ శనివారం అనగా 14-1-2017 పగలు గం।। 12.48 ని।।లకు ఆశ్రేష నక్షత్రము, ప్రీతి యోగం - గరజి కరణం, మేష లగ్నము. రవి మకరరాశి యందు ప్రవేశించి సంచరించును. సంక్రమణమైన తదుపరి 24 ఘ. అనగా గం।।9.36ని।।లు పుణ్యకాలము. ఈ మకర సంక్రమణ పుణ్యకాలములో పితృదేవతలను సంతృప్తి పరచుటకు పిండ ప్రదానములు చేయుట, తర్పణ దానములు చేయుట వలన వంశాభివృద్ధి.

తిథి బహుళ విదియ – సుభిక్షం సస్య వృద్ధియగును. వారం శనివారం – రాక్షస నామం శుద్ధోదక స్నానంచే సువృష్టి వ్యాధి దుర్భిక్షం, చోర భయం, నక్షత్రం ఆశ్రేష – రాజ విద్వరం, యోగం ప్రీతి – శుభం, కరణం గరజి – గోరోచన చందన లేపనంచే శుభం, లగ్నం మేషం – జగత్తున ఆనందం, మధ్యాహ్నం – విప్రులకు నాశనము, బహుళ పక్షము పాడిపంటల సమృద్ధి కలుగును. అస్య పురుషస్య రాక్షస నామధేయం ఫలం,మద్యపానాదుల యందు ఆసక్తి గలవారికి, మ్లేచ్చ ఆటవిక జాతులకు సుఖం కలిగించును. ముద్గాక్షత ధారణ – పెసర పంటల నాశనం, రక్త వస్త్ర ధారణ – రోగదాయకం, లాక్షా గంధలేపనం – దుష్టులు నశింతురు, జపాపుష్ప ధారణ – యుద్ధము, గోమేధికాభరణ ధారణ – మహా భయం, సీసపాత్ర భోజనం – యుద్ధదాయకం, పాలు ఆహారం – కీర్తి హాని, రేగు పండు భోజనం – సర్వ జంతువులకు సుఖప్రదం, కోదండ శస్త్ర ధారణ – హాని, కాంచన ఛత్రధారణ – రోగనాశనం, గజవాహనం – అరణ్య జంతునాశనం, కుంత ధారణ – ప్రజాక్షోభ, విస్మయ చేష్టః – అశుభం, నివిష్ఠావస్థ (కూర్చుని యుండుట) – మధ్యమ ధరలు, ఆగ్నేయ దిగ్యానం – తద్దేశారిష్టం.

ఫలశ్రుతి -      సంక్రాన్తి పురుషోత్పత్తికాలే దానం స్వశక్తితః

ఫలాని కాంస్యాది దానాని దీయంతే దోషనాశనమ్।।

·        ఫలాని మూలాన్యజినం సువర్ణం గ్రామాంశుకాద్యం సతిలేక్షు గావః

ధాన్యం ఖరాంశో.ర్మకర ప్రవేశ యాతాని-దానాని విశేషితాని।।

·        తేజసే రూప సామర్థ్యాత్ సార్వభౌమః ప్రజాయతే

యశ్శృణోతి మధు శుక్ల పక్షకే వర్షనాథ సచివాధికం ఫలం

ప్రాప్నుయాద్దురితముక్త విగ్రహశ్చాయు రర్థ మతులం యశస్సుఖమ్।।