శుభ ముహూర్తములు

 Øమీనచైత్రో ధనుః పుష్యో మిథునాషాఢకోపిచ।

కన్యాభాద్రపదో మాసః శూన్యమాసాః ప్రకీర్తితాః।।

ఈ సంవత్సరం యాధావిధిగా శుభముహూర్తములు వ్రాయడమైనది. మీన చైత్ర ధనుర్మాసములు శుభకార్యములకు నిషిద్ధము. ప్రాంతీయ ఆచారములలో  దేశవ్యవస్థలందు ఆచరించుట, వ్రాయుట మాత్రము జరుగుచున్నవి. ఈ సంవత్సరం ఏప్రిలే 30 అనగా చైత్ర బహుళ అష్టమి స్థిరవారము శుక్రమౌఢ్యమి ప్రారంభమై జూలై13 ఆషాఢ శుక్లనవమి బుధవారము త్యాగమైనది. వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనవివాహాది శుభముహూర్తములు లేవు.

 తిరిగి భాద్రపద శుక్లదశమి సెప్టెంబర్11 నండి ఆశ్వయుజ శు దశమి  అక్టోబరు 10 మధ్య గురు మౌఢ్యమి, సంవత్యరాంతములో మార్చి 20 నుండి పునః శుక్ర మౌఢ్యమి. కావున ముహూర్తములు తక్కువ. మొత్తం మీద ముహూర్తములు చాలా స్వల్పంగా ఉండటం చేత, విజ్ఞులు ఉన్నవాటిని క్షీర, నీర న్యాయముగా పరిశీలించి ఉపయోగించుకోవలెను.